Begin typing your search above and press return to search.
కేసీఆర్‌కు నియంతలు...కేటీఆర్‌కు సమంతలు అంటే ఇష్టం
By: Tupaki Desk | 17 March 2015 7:17 AM GMTచెణుకులు వేయడంలో తెలంగాణలో ఉన్న కొద్దిమంది నాయకుల్లో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిది అందెవేసిన చెయ్యి. ప్రతిపక్షంపై విమర్శలు చేయడంలోనూ ప్రాసలు ఉపయోగించే కొద్దిమంది నాయకుల్లో ఆయనొకరు. తాజాగా తమ సస్పెన్సన్ ను ఎత్తివేయాలంటూ చేయని ప్రయత్నం అంటూ లేని టీడీపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి, ఆయన సహచరులపై చెణుకులు విసురుతున్నారు.
రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ''కేసీఆర్‌కు నియంతలు, కేటీఆర్‌కు సమంతలు అంటే ఇష్టం'' అంటూ వ్యాఖ్యానించారు. తన స్థాయికి మించి మాట్లాడుతున్న కేటీఆర్‌కు ఈ విధంగానే రియాక్షన్ ఇవ్వాలని పేర్కొన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను, నేతలను ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా లాక్కుంటున్న టీఆర్‌ఎస్ పార్టీ గుర్తింపు రద్దుచేయాలని డిమాండ్ చేశారు.
పార్టీ మారిన వారిపై సస్పెన్సన్ ఎత్తివేయాలంటూ అసెంబ్లీ స్పీకర్‌ను కోరినా ఆయన స్పందించడం లేదని ఆరోపించారు రేవంత్ రెడ్డి. సీఎం కేసీఆర్, శాసనసభా వ్యవహారాల మంత్రి టి.హరీశ్ రావు ఆధ్వర్యంలో స్పీకర్ పనిచేస్తున్నట్లుంది అని ఆరోపించారు. అందుకే తాము రాజ్యాంగబద్దంగా ఫిర్యాదుచేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. అందుకే గవర్నర్‌తో పాటు రాష్ట్రపతి తలుపు తడుతున్నట్లు చెప్పారు.