Begin typing your search above and press return to search.
జీ బ్లాక్ రహస్యం తేల్చాలి!
By: Tupaki Desk | 15 July 2020 8:30 AM GMTసచివాలయం కూల్చివేతపై అనుమానాలు వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. జీ బ్లాక్ ఉన్న స్థలాన్ని పురావస్తు శాఖ అధికారులకు అప్పగించి పరిశోధన సాగించాలని ఆయన డిమాండ్ చేశారు. జీ బ్లాక్ కింద భూగర్భంలోని రహస్యాలు నిగ్గు తేలాల్సి ఉందన్నారు.
‘ఆపరేషన్ జీ బ్లాక్’ వెనుక భారీ ఆర్థిక దోపిడీకి కుట్ర జరిగిందని ప్రజలు భావిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సచివాలయం కూల్చివేతను అర్ధరాత్రి కేసీఆర్ ఎందుకు ప్రారంభించాడో చెప్పాలని.. గుప్త నిధుల కోసమే ఇలా తవ్వకాలు చేస్తారని రేవంత్ ఆరోపించారు.కూల్చివేత ఆపాలంటూ హైకోర్టు స్టే ఇచ్చిన తర్వాత కేసీఆర్ బాహ్య ప్రపంచంలోకి వచ్చారు అని రేవంత్ ఆరోపించారు.
సచివాలయంలోని జీ బ్లాక్ ను 1888లో ఆరో నిజాం నవాబ్ అలీఖాన్ నిర్మించారని.. దీనిని సైఫాబాద్ ప్యాలెస్ అని పిలిచేవారని రేవంత్ తెలిపారు. ఆనాడు నిజాం రాజ్యం ఆర్థిక వ్యవహారాలు, ట్రెజరీ కార్యకలాపాలు ఈ జీ బ్లాక్లోనే జరిగేవన్నారు. నిజాం రిజర్వ్ బ్యాంక్ గా జీ బ్లాక్ ఉండేదని.. దీని కింద సొరంగాలు బయటపడ్డాయని రేవంత్ తెలిపారు.ఈ బ్లాక్ కింద భూగర్భంలో స్ట్రాంగ్ రూములు నిర్మించినట్టు అనుమానాలున్నాయని జి బ్లాక్ కింద నిజాం నిధి కచ్చితంగా ఉందన్న సంకేతాలు కనిపించాయని.. ఈ వేల కోట్ల సంపద కొల్లగొట్టడానికే సచివాలయం కూల్చివేత అర్ధరాత్రి చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
సొరంగాలపై పరిశోధనకు పురావస్తుశాఖ అనుమతి కోరినా కేసీఆర్ సర్కార్ ఇవ్వలేదని.. తాజాగా సచివాలయం కూల్చివేతను రహస్యంగా చేపట్టడాన్ని చూస్తే నిజంకు చెందిన వేల కోట్ల సంపద.. దోపిడీకి స్కెచ్ సిద్ధమైందా అన్న అనుమానాలు కలుగుతున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కోర్టు ఈ విషయాన్ని సుమోటోగా తీసుకోవాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.