Begin typing your search above and press return to search.
సీఎం కేసీఆర్ పై షాకింగ్ వ్యాఖ్యలు చేస్తూ రేవంత్ కంట కన్నీరు
By: Tupaki Desk | 24 Aug 2021 4:30 PM GMTతెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి నోరు విప్పితే చాలు.. శూలాలు మాదిరి దూసుకెళ్లే మాటలతో సీఎం కేసీఆర్ ను ఆయన కుమారుడు కేటీఆర్ ను అదే పనిగా వాయించేస్తుంటారు. ఘాటు విమర్శల విషయంలో ఆయన ఏ మాత్రం తగ్గని విషయం తెలిసిందే. టీపీసీసీ చీఫ్ అయిన తర్వాత నుంచి అదే పనిగా పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ.. సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరుగుతున్న ఆయన.. తాజాగా కేసీఆర్ దత్తత తీసుకున్న మూడుచింతపల్లి గ్రామంలో దీక్ష చేపట్టటం తెలిసిందే. మంగళవారం మొదలైన దీక్ష బుధవారం సాయంత్రం దళిత ఆత్మగౌరవ సభతో ముగియనుంది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన దత్తత గ్రామాల్లోని పరిస్థితి గురించి ప్రస్తావిస్తూ ఆయన కంట కన్నీరు పెట్టుకోవటం సంచలనంగా మారింది. సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న మూడు చింతపల్లి గ్రామంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన విషయాన్ని గుర్తు చేశారు. పేరుకు సీఎం దత్తత గ్రామాలే కానీ ఎలాంటి డెవలప్ మెంట్ కార్యక్రమాలు జరగలేదన్నారు.
మూడు చింతలపల్లి.. లక్ష్మాపూర్.. కేశవా పూర్ గ్రామాల్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్నా.. కాంగ్రెస్ కార్యకర్తలు స్థానిక ఎన్నికల్లో గెలిచారంటే అక్కడ ఎంత డెవలప్ మెంట్ జరుగుతుందో అర్థమవుతుందన్నారు. ఎర్రవల్లి ఫాంహౌస్ కు వెళ్లేందుకే సీఎం కేసీఆర్ రోడ్డు వేసుకునేందుకు మాత్రమే ఈ మూడు గ్రామాల్ని దత్తత తీసుకున్నారన్నారు. టీఆర్ఎస్ నేతలు ఫించన్లు ఇచ్చారంటూ చెబుతున్నారని.. ఈ మూడు గ్రామాల్లో ఎంతమందికి పింఛన్లు ఇచ్చారో తెలపగలరా? అని సవాలు విసిరారు.
తాను రెండు రోజులు ఊళ్లోనే ఉంటానని.. ఎంతమందికి పథకాలు అందుతున్నాయో ఇంటింటికి వెళ్లి చూద్దామా? అని ప్రశ్నించారు. చిన్న ముల్కనూర్ ను దత్తత తీసుకున్నప్పుడు అందరికి ఇండ్లు కట్టిస్తానని చెప్పి.. ఉన్న ఇళ్లను కూల్చివేశారని.. ఇప్పటివరకు కనీసం ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదన్నారు. చిన్నముల్కనూరులో ఆడపిల్లలు స్నానం చేసేందుకు సౌకర్యం లేని కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.
తాను చిన్న ముల్కనూరుకు వెళ్లినప్పుడు తనకు ఎదురైన అనుభవం గురించి చెబుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 'కేసీఆర్ హామీతో ఇంటిని కూల్చి వేసుకున్న కుటుంబం.. చిన్న గుడిసె వేసుకొని ఉంది. వారింట్లో ముగ్గురు ఆడపిల్లలు స్నానాలు చేసేందుకు బాత్రూంలు లేక గుడిసె పక్కన నాలుగు తడకలు వేసుకొని స్నానాలు చేస్తుంటే.. పక్కపాంటి ఇండ్ల మగ పొరగాళ్లు చూస్తూ ఎగతాళి చేశారు. ఆ విషయం ఆ ఇంటి వాళ్లు చెబుతుంటే కండ్లలో నీళ్లు తిరిగాయి'' అంటూ కంట కన్నీరు పెట్టున్నారు. ఎప్పుడు మాటలతో విరుచుకుపడే రేవంత్..తన తీరుకు భిన్నంగా భావోద్వేగానికి గురి కావటమే కాదు.. కంట కన్నీరు పెట్టుకోవటం అక్కడి వారిని కదిలించింది. ఇలాంటి వాటికి కారణం సీఎం కేసీఆర్ బాధ్యుడని.. ఆయన్ను వంగబెట్టి చెప్పుతో కొట్టాలంటూ తీవ్రఆగ్రహంతో వ్యాఖ్యానించారు. రేవంత్ తీసుకొచ్చిన ఈ ప్రస్తావన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. సీఎం దత్తత గ్రామాల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా? అన్న భావన కలగటం ఖాయం.