Begin typing your search above and press return to search.

దాడులే కాదు..సోష‌ల్ అకౌంట్స్ కూడా బ్లాక్ చేశారట‌!

By:  Tupaki Desk   |   30 Sep 2018 6:51 AM GMT
దాడులే కాదు..సోష‌ల్ అకౌంట్స్ కూడా బ్లాక్ చేశారట‌!
X
తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి క‌ష్టాలు చుట్టు ముట్టేస్తున్నాయి. తీవ్ర‌మైన ఆక్ర‌మాస్తుల ఆరోప‌ణ‌లు ఒక‌వైపు ఇబ్బంది పెడుతుంటే.. మ‌రోవైపు ఐటీ దాడుల‌తో రేవంత్ కు చుక్క‌లు చూపిస్తున్నాయి. సుదీర్ఘ విచార‌ణ‌లో భాగంగా.. రేవంత్ ను అధికారులు వేసిన ప్ర‌శ్న‌ల‌కు చాలావ‌ర‌కూ స‌మాధానం చెప్ప‌లేక‌పోయిన‌ట్లుగా చెబుతున్నారు. ఎన్నిక‌ల వేళ‌లో అధికారులు త‌న‌ను ఇబ్బంది పెట్టేలా వ్య‌వ‌హ‌రిస్తార‌న్న ఉద్దేశంతో ముంద‌స్తుగా రేవంత్ ప్రిపేర్ అయిన‌ట్లు చెబుతున్నారు.

అయితే..రేవంత్ ఊహించ‌ని రీతిలో క్వ‌శ్చ‌న్లు వేసిన అధికారులు.. ఆయ‌న్నుఉక్కిరిబిక్కిరిచేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఐటీ అధికారుల దాడులు ఒక ప‌క్క ఇరిటేట్ చేస్తున‌న వేళ‌.. మ‌రోవైపు రేవంత్ రెడ్డికి సంబంధించిన ప‌ది సోష‌ల్ మీడియా ఫేస్ బుక్ అకౌంట్ల‌ను తాజాగా బ్లాక్ చేసిన‌ట్లుగా చెబుతున్నారు. రేవంత్ రెడ్డి సోష‌ల్ మీడియా వింగ్ నిర్వ‌హించే దాదాపు ప‌దికి పైగా ఫేస్ బుక్ అకౌంట్లు గ‌డిచిన 72 గంట‌లుగా ఎలాంటి పోస్టులు చేయ‌కుండా ఉండ‌టం గ‌మ‌నార్హం. అధికారుల నుంచి వెళ్లిన ప్ర‌త్యేక ఆదేశాల నేప‌థ్యంలోనే సోష‌ల్ మీడియా అకౌంట్ల‌పై ఆంక్ష‌లు విధించిన‌ట్లుగా చెబుతున్నారు.

ప్ర‌స్తుతం రేవంత్ ఆస్తుల‌పై ఐటీ అధికారులు దాడులు నిర్వ‌హించిన నేప‌థ్యంలో.. ఆయ‌న ఫేస్ బుక్ పేజీల‌ను బ్లాక్ చేయాల‌న్న ఆదేశాల‌తో పాటు.. ఆయ‌న‌కు సంబంధించిన ట్విట్ట‌ర్.. వాట్సాప్ అకౌంట్ల‌పై కూడా ఒక క‌న్నేసిన‌ట్లుగా చెబుతున్నారు. మొత్తానికి.. రేవంత్ చుట్టూ ఉచ్చు బిగుసుకునే ప్ర‌య‌త్నం ఒక్కొక్క‌టిగా జ‌రుగుతుంద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.