Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ ను ఇర‌కాటంలో పెట్టే స్కెచ్ వేసిన‌ రేవంత్

By:  Tupaki Desk   |   1 March 2018 12:59 PM GMT
కేసీఆర్‌ ను ఇర‌కాటంలో పెట్టే స్కెచ్ వేసిన‌ రేవంత్
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ ను తన జీవిత‌కాల రాజకీయ ప్ర‌త్య‌ర్థిగా భావించే కాంగ్రెస్ పార్టీ నేత‌ - ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మ‌రోమారు ఆయ‌న్ను ఇర‌కాటంలో పెట్టే స్కెచ్ సిద్ధం చేశారు. రాజ్య‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఓ వైపు పావులు క‌దుపుతుండ‌గా..మ‌రో వైపు ఆయ‌న్ను బుక్ చేసేందుకు రేవంత్ ప్లాన్ సిద్ధం చేశారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆయ‌నే వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. తాజాగా మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన రేవంత్ ఈ సంద‌ర్భంగా అమ‌ర‌వీరుల కుటుంబాల కేంద్రంగా స‌ర్కారుపై మండిప‌డ్డారు.

రాజ్యసభ ఎన్నికల్లో అమరవీరుల కుటుంబాలకు కేసీఆర్ అవకాశం ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. టీఆర్ ఎస్‌ సంఖ్యాబలం ప్రకారం రెండు రాజ్యసభ సీట్లు వస్తాయని - మూడోది ఫిరాయింపు ఎమ్మెల్యేలతో వచ్చేదేన‌ని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కనీసం మూడవ సీటును అమరవీరులకు కుటుంబాల‌కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజ్యసభ‌కు కేసీఆర్ తన సోదరుని కొడుకు సంతోస్‌ ను పంపాలని చూస్తున్నార‌ని అయితే రాజ్యసభకు కుర్రకుంక అయిన సంతోష్‌ ను ఎలా పంపిస్తారని ప్ర‌శ్నించారు. `సంతోష్ కు ఉన్న అర్హత ఏంటి? కేసీఆర్ కు సపర్యలు చేయడమే సంతోష్‌ కు ఉన్న అర్హతనా.? కేసీఆర్ తన కుటుంబసభ్యులకు పదవుల వీలునామా వ్రాస్తున్నారా.? సంతోష్‌ కు రాజ్య‌స‌భ సీటు ఇవ్వడం అంటే తెలంగాణ‌ అమరవీరులను అవమానించడమే` అని రేవంత్ విరుచుకుప‌డ్డారు. నేరెళ్లలో దళితులపై దాడి కారకుడు, ఇసుక మాఫియాకు యజమాని సంతోష్ రావేన‌ని రేవంత్ ఆరోపించారు. సంతోష్ భూ ఆక్రమణలపై త‌న వ‌ద్ద ఆధారాలున్నాయని రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ఉద్యమంతో సంతోష్‌ కు అసలు సంబంధమే లేదని విమ‌ర్శించారు. `రాష్ట్రంలో కోట్ల రూపాయల దోపిడీ వెనక సంతోష్ ఉన్నారు. రాష్ట్రంలో షాడో సీఎంగా సంతోష్ కోట్లు కొల్లగొడుతున్నాడు.` అని ఆరోపించారు. కేసీఆర్ అమరవీర కుటుంబాలకు అవకాశం ఇవ్వకపోతే కాంగ్రెస్ బరిలో దిగుతుంది

అమరవీరుల కుటుంబం నుండి అభ్యర్థిని నిలబెడతామ‌ని రేవంత్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దీనిపై పార్టీలో మాట్లాడుతున్నామ‌ని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ నుండి అమరవీరుల కుటుంబాల సభ్యుడిని పోటీలో నిలబెడతామ‌ని రేవంత్ ప్ర‌క‌టించారు. కేసీఆర్ అమరవీరుల కుటుంబాలకు రాజ్యసభ ఇవ్వకపోతే ..ప్రజల ముందు దోషిగా నిలబెడతామ‌ని రేవంత్ ప్ర‌క‌టించారు.