Begin typing your search above and press return to search.
కేసీఆర్ పై వ్యూహం మార్చిన రేవంత్
By: Tupaki Desk | 30 Jan 2017 4:15 PM GMTటీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై వినూత్న పంథాలో పోరాట కార్యాచరణను రూపొందించుకున్నట్లు తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్లు ఆయన వివరించారు. కరవుతో గత రెండు సంవత్సరాలుగా పంటలు చేతికి రాక రైతులు నష్టపోయి అప్పలపాలైపోయారు. ఈ నేపథ్యంలో కేంద్రం విడుదల చేసిన ఇన్ ఫుట్ సబ్సిడీని రైతులకు ఇవ్వకుండా దారి మళ్లించడంపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన వివరించారు. ఫిబ్రవరి 6 - 7 - 8 తేదీలలో ఢిల్లీలో రాష్ట్ర సమస్యలపై వినతి పత్రాలను కేంద్ర మంత్రులకు సమర్పించనున్నామని ఆయన వివరించారు. ఆవాస యోజన పథకం కింద తెలంగాణ రాష్ట్రానికి లక్ష ఇళ్లకు నిధులను కేటాయిస్తే ముఖ్యమంత్రి దత్తత గ్రామాలలో 50 నుంచి 100 ఇళ్లు కట్టించి అవే డబుల్ బెడ్రూం ఇళ్లని ప్రజలను భ్రమలలో పెడుతున్న విషయాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు దృష్టికి తీసుకెళ్లనున్నామని వెళ్లడించారు.
గతంలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును జాతీయ హోదాగా ప్రకటించాలని డిమాండ్ చేసిన కేసీఆర్ ఇప్పుడు ఏమీ మాట్లాడడం లేదని దీనిపై కేంద్ర ఇరిగేషన్ మంత్రిని కలువనున్నామని రేవంత్ రెడ్డి వివరించారు. జోనల్ వ్యవస్థ రద్దుపై కేంద్ర హోం శాఖ మంత్రికి వినతి పత్రాన్ని ఇవ్వనున్నామని తెలిపారు. దళితులను ముఖ్యమంత్రి చేస్తామన్న హామీని తుంగలో తొక్కారని మరోసారి మోసం చేయడానికి దళితులను - గిరిజనులను భ్రమలలో ఉంచడానికి మొన్న సమావేశం జరిపి దళితులకు - గిరిజనులకు ఏం కావాలన్నా చేస్తామంటున్నారని మండిపడ్డారు. సాంఘిక సంక్షేమ శాఖను తన దగ్గరే ఉంచుకొని అద్భుతంగా చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి రూ. 9 వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించారని, ఆ తరువాత ఆ శాఖను అగ్రకుల వ్యక్తి అయిన జగదీశ్ రెడ్డికి అప్పజెప్పారని ఆరోపించారు. రాష్ట్రంలోని 2013-14 సంవత్సరంలో 20 లక్షల హెక్టార్లలో వరి సాగు చేయగా 2014-15 సంవత్సరంలో 14 లక్షల 50 వేల హెక్షార్లకు, 2015-16 సంవత్సరంలో 10.9 లక్షల హెక్టార్లకు పడిపోయింది. ఇదే సమయంలో వరి దిగుబడులు 60 లక్షల టన్నుల నుంచి 30 లక్షల టన్నుల వరకు పడిపోయిందని వివరించారు. ప్రభుత్వం చెబుతున్న కోటి ఎకరాల సాగు అనేది మాటల వరకే తప్ప చేతల్లో చూపడం లేదని ఈ గణాంకాలే తెలియజేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలేరు రిజర్వాయర్ పూర్తిచేశామని చెప్పడంలో కూడా వక్రభాష్యాలు ఉన్నాయని వివరించారు. గతంలో ఇందిరాసాగర్ కు వినియోగించిన మోటార్లనే వినియోగించుకొని తక్కువ కాలంలో పూర్తి చేశామని గొప్పలు చెప్పుకొంటున్నారని ఆరోపించారు. 3వ విడత రుణమాఫీని ఇంకా 80 శాతం మందికి ఇవ్వలేదని, అన్ని సమస్యలపై ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పోరాటం చేయాలని నిర్ణయించామని రేవంత్ రెడ్డి వివరించారు.
నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు భవనాలను నిర్మించలేదు కానీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ లో మాత్రమే ఎమ్మెల్యే భవన్ ను నిర్మించారని రేవంత్ రెడ్డి వివరించారు. ఇప్పటికైనా ప్రజా సమస్యలను ప్రభుత్వ పరిష్కరించని పక్షంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని తెలిపారు. ఫిబ్రవరి 13 తేదీన కొల్లాపూర్‌లో, 15వ తేదీన గజ్వేల్ లో, ఫిబ్రవరి 20వ తేదీన నిర్మల్లో బహిరంగ సభలను నిర్వహించాలని నిర్ణయించామని వివరించారు. ముఖ్యమంత్రి, మంత్రుల నియోజకవర్గాల్లో ప్రజలు ఎంత నిరుత్సాహంగా ఉన్నారో తెలియజేయడానికి ఈ సభలు నిర్వహిస్తున్నామని ప్రకటించారు. అదే సమయంలో ప్రతి నియోజకవర్గంలో స్థానిక సమస్యలపై చర్చలు జరపడానికి సమావేశాలు జరుగుతాయని తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/