Begin typing your search above and press return to search.
రేవంత్ రెడ్డి వ్యూహాత్మక అడుగులు
By: Tupaki Desk | 26 Aug 2021 6:30 AM GMTతెలంగాణ పీసీసీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి అడుగులు వ్యూహాత్మకంగా పడుతున్నాయి. మొదట తనను వ్యతిరేకించిన సీనియర్లను స్వయంగా వారి ఇంటికెళ్లి కలిసి మరీ ఆ అసంతృప్తిని తగ్గించాడు. ఇక తనతో పోటీపడ్డ కోమటిరెడ్డిని కూడా కూల్ చేసిన ఘనత రేవంత్ రెడ్డి సొంతం. టీడీపీ నుంచి వచ్చి కాంగ్రెస్ పీసీసీ చీఫ్ అయిన రేవంత్ రెడ్డి ఇంత తొందరగా ఇంత బాగా వ్యవహారాలు చక్కబెడుతారని ఎవరూ ఊహించలేదు. ప్రస్తుతం సీనియర్లు అంతా చేసేదేం లేక సైలెంట్ గా ఉన్నారు. తీవ్రంగా వ్యతిరేకించిన కోమటిరెడ్డి సైతం తన ఆహాన్ని పక్కనపెట్టి సర్దుకుపోతున్నారు.
రేవంత్ తో చివరిదాకా నువ్వా నేనా అన్నట్టుగా తలపడ్డ కోమటిరెడ్డికే తప్పనప్పుడు ఇక మిగిలిన నేతల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక రేవంత్ రెడ్డికి కూడా ఈ విషయాలు తెలుసు. తాను పీసీసీ చీఫ్ గా సక్సెస్ అయితే ఓకే.. కాకుంటే ఇదే కాంగ్రెస్ సీనియర్లు రేవంత్ ను తొక్కేసేందుకు కాచుకు కూర్చున్నారన్న విషయం ఆయనకు తెలుసు. అందుకనే ఇప్పటి నుంచే ముందు జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే పార్టీలో ప్రత్యేకంగా తన వర్గాన్ని తయారు చేసుకుంటున్నారని తెలుస్తోంది.
సీనియర్లు ఎలాగూ తనను వ్యతిరేకించడం ఖాయమని గ్రహించిన రేవంత్ రెడ్డి.. ఇప్పటి నుంచే ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని.. ఇంతకాలం నిరాదరణకు గురైన నేతల్లో గట్టివారిని ఎంచుకొని మరీ తన మద్దతుదారులుగా రెడీ చేసుకుంటున్నారట.. ఇందుకోసం రేవంత్ రెడ్డి పెద్ద స్కెచ్ వేసినట్టు చెబుతున్నారు.
రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాక పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. దీంతో వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే కాంగ్రెస్ ఇప్పటికే చాలా సార్లు రాష్ట్రంలో అధికారంలో ఉంది గనుక ఆ పార్టీ అధికారంలో వస్తుందనడంపై ప్రజలు కొంత ఆలోచిస్తున్నారు.రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టగానే తన టార్గెట్ ను ఫిక్స్ చేసేశాడు. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలని డిసైడ్ అయ్యాడు. అందుకే కేసీఆర్ టార్గెట్ గానే రాజకీయాలు మొదలుపెట్టాడు.తాజాగా నిరుద్యోగం, పెరుగుతున్న ధరలను రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక టేకప్ చేశాడు. తాజాగా పెట్రో, డీజిల్ ధరలపై పోరుబాట పట్టాడు.పెరుగుతున్న ఇంధన ధరలపై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ తొలి నిరసన చేపట్టారు. రేవంత్ నేతృత్వంలో ‘చలో రాజ్ భవన్’ కు పిలుపునిచ్చాడు. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్న కేంద్రరాష్ట్రప్రభుత్వాలపై దండెత్తాడు. అదేఊపును కొనసాగించాలని పార్టీని బలోపేతం చేయాలని రేవంత్ స్కెచ్ గీస్తున్నాడు.
మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన నాయకత్వానికి సవాల్ విసరగలిగే నేతలు ఎవరు? తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే తన నాయకత్వాన్ని ఆమోదించిన వారు ఎవరు? మనస్ఫూర్తిగా తన నాయకత్వాన్ని అంగీకరించింది ఎవరు? అనే పద్ధతిలో నేతలను వర్గీకరించి రేవంత్ రెడ్డి వడబోస్తున్నట్టు సమాచారం.
ప్రధానంగా సవాల్ చేసేవారు.. మోహమాటంగా తనను అంగీకరించిన వారి నేతల నియోజకవర్గాలపై రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టిసారించినట్టు చెబుతున్నారు. ఇలాంటి నియోజకవర్గాల్లోని ప్రస్తుత నేతలకు ప్రత్యామ్మాయంగా తన మద్దతుదారులను యాక్టివ్ చేయించాలన్నది రేవంత్ రెడ్డి ప్లాన్ గా తెలుస్తోంది.
రేపు సీనియర్లు తనను వ్యతిరేకించినప్పుడు తన మద్దతుదారులు తనకు అండగా నిలవాలనేట్లుగా రేవంత్ ఈ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి వ్యూహాలు ఎంతవరకు పనిచేస్తాయన్నది వేచిచూడాలి.