Begin typing your search above and press return to search.
ఢిల్లీకి లింకుపెట్టి కేసీఆర్ పై రేవంత్ ఫిర్యాదు
By: Tupaki Desk | 20 Jan 2018 10:52 AM GMTఊహించిందే జరిగింది! తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే ఒంటికాలిపై లేచే కొడంగల్ ఎమ్మెల్యే - కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డికి మరో అస్త్రం దొరికింది. అయితే అది ఎప్పట్లాగే రాష్ట్రంలో జరిగిన పరిణామం. ఢిల్లీలో జరిగింది. ఎక్కడ జరిగింది అనేదానికంటే..కేసీఆర్ ను టార్గెట్ చేసుకునేందుకు సదరు అంశాన్ని ఉపయోగించుకునే రేవంత్ తాజాగా దాన్ని వాడుకొని ఇరకాటంలో పడేసే నిర్ణయం ప్రకటించారు.
రాజ్యాంగానికి విరుద్ధంగా లాభదాయక పదవులు చేపట్టారని తేల్చిన ఈసీ - ఆప్ ఎమ్మెల్యేలపై చర్యలకు సిఫార్సు చేస్తూ రాష్ట్రపతికి నివేదిక పంపిన సంగతి తెలిసిందే. ఆప్ ప్రభుత్వం 21మంది ఎమ్మెల్యేలను పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించింది. వీరిపైనే ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. దీన్ని ఆధారంగా చేసుకునే..రేవంత్ తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఇరకాటంలో పడేసే కామెంట్లు చేశారు. శాసనసభ సభ్యుల సంఖ్య ప్రకారం 15 శాతం మంత్రుల సంఖ్య - కేబినెట్ హోదా మించకూడదని - 120 శాసన సభ్యులకు 18 మంది మంత్రులు ఉండొచ్చని తాజాగా జరిగిన విలేకరుల సమావేశంలో రేవంత్ తెలిపారు. ఇవి కాకుండా అరుగురు పార్లమెంట్ సెక్రెటరీ సభ్యులను నియమించారని గుర్తుచేశారు. దీంతో తాము కోర్టుకెళ్ళామని - హైకోర్టు తక్షణమే వాళ్ళను తొలగించాలని పేర్కొందని రేవంత్ వివరించారు. అయితే మళ్లీ 21 మంది పార్లమెంట్ సెక్రెటరీలని నియమించారని రేవంత్ తెలిపారు.
కేసీఆర్ ప్రభుత్వం నియమించిన పార్లమెంటరీ సెక్రటరీలు చట్టవిరుద్ధమని ఆనాడు కోర్టు చెప్పిందని గుర్తు చేసిన రేవంత్...అయినా కేసీఆర్ అనేకమందికి కేబినెట్ హోదాలు కట్టపెట్టి అధికార దుర్వినియిగానికి పాల్పడ్డారని మండిపడ్డారు. హైకోర్టు చెప్పిన దానికి వ్యతిరేకంగా మరో 21మందిని కేసీఆర్ లాభదాయక పదవులలో నియమించి కోర్ట్ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపించారు. ఢిల్లీలో మాదిరే తెలంగాణలో చట్టవిరుద్ధంగా నియమించిన పార్లమెంటరీ సెక్రటరీ లను ఎమ్మెల్యే లపై అనర్హులుగా ప్రకటించాలని,వారు అక్రమంగా అనుభవించిన నిధులను రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. అరుగురిని ఎమ్మెఎలుగా ప్రకటించాలని కోరుతూ వచ్చే సోమవారం ఎలక్షన్ కమిషన్ కు పిర్యాదు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. మిగిలిన 21 మందిపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.