Begin typing your search above and press return to search.

కొత్త పార్టీ ప్రకటించబోతున్న రేవంత్ రెడ్డి !

By:  Tupaki Desk   |   21 March 2020 3:30 AM GMT
కొత్త పార్టీ ప్రకటించబోతున్న రేవంత్ రెడ్డి !
X
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ , ఫైర్ బ్రాండ్ , తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ...రేవంత్ రెడ్డి సొంత పార్టీ ఏర్పాటు చేయబోతున్నారా? అంటే , దీనికి ఇప్పుడు అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది. రేవంత్ రెడ్డి సన్నిహితుల మాటలని బట్టి చూస్తే అతి త్వరలోనే కొత్త పార్టీ తో రేవంత్ రెడ్డి ...ప్రజల ముందుకు రాబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్ లో తెలంగాణ ఫైర్ బ్రాండ్ గా కొనసాగుతున్నా కూడా పార్టీలోని కొందరు సీనియర్ల కి రేవంత్ టార్గెట్ అయ్యారు.

దీనికి ప్రధాన కారణం ..తెలంగాణ పీసీసీ పదవి. ప్రస్తుతం టీ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని త్వరలోనే తొలగించి ..అయన స్థానాల్లో మరొకరికి అవకాశం అధిష్టానం ఇవ్వబోతుంది అని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు పీసీసీ మార్పుని వాయిదా వేస్తూ వస్తుంది. కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ ..పార్టీ లోని పలువురు సీనియర్లు పీసీసీ కుర్చీ కోసం రేవంత్ తో పోటీ పడుతున్నారు. ఎప్పటినుండో పార్టీని నమ్ముకొని ఉన్నవారికి కాకుండా ..వేరే పార్టీలో నుండి వచ్చిన వారికీ పీసీసీ పదవి ఇస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదు అని కొందరు కాంగ్రెస్ నేతలు బహిరంగం గానే రేవంత్ కి వ్యతిరేకంగా మాట్లాడారు. దీనితో తెలంగాణ పీసీసీ పదవి రావడం కష్టమనే యోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారు.

రేవంత్ రెడ్డి పట్ల హైకమాండ్ చాలా సానుకూలంగా ఉన్నప్పటికీ, ఆయనకు రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకుల నుండి ఎటువంటి మద్దతు లభించలేదు. తాజాగా మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ పై అనుమతి లేకుండా డ్రోన్ ఎగుర వేసిన కేసులో రేవంత్ ని జైల్లో వేసినప్పుడు కూడా ఒక్క పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్ప ..మిగిలిన ఏ ఒక్క కాంగ్రెస్ సీనియర్ నేత కూడా ఆ విషయం పై రియాక్ట్ అవ్వలేదు. అయన కూడా ఎదో సంఘీభావం ప్రకటించాలి కాబట్టి ..ఎదో రెండు ముక్కలు చెప్పి , సైలెంట్ అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ని బలమైన పార్టీగా మార్చాలని రేవంత్ చేస్తున్నప్పటికీ ..పార్టీ నేతల మద్దతు లభించకపోవడంతో రేవంత్ కొంత అసహనంలో ఉన్నాడు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నన్ను కలవడానికి జైలుకి అయిన వచ్చిండాలి, లేదా నన్ను ఏ కారణం చెప్పి జైల్లో పెట్టారో ఆ కారణంతోనే ఆ ఉద్యమాన్ని కొనసాగించడానికి జాన్వాడాలోని కెటిఆర్ యొక్క ఫామ్‌ హౌస్‌ దగ్గర ఆందోళన చేసింటే బాగుండేదని, కాంగ్రెస్ నాయకులలో ఐక్యత లేక పోవడం వల్లనే రాష్ట్రంలో టీ ఆర్ ఎస్ ప్రభుత్వం మనుగడ సాగిస్తుంది అని అయన తన సన్నితుల వద్ద చెప్పినట్టు సమాచారం.

ఈ నేపథ్యంలోనే కొత్త ప్రాంతీయ పార్టీని ప్రారంభించడం వల్ల కలిగే లాభాలు, నష్టాలు గురించి రేవంత్ ఇప్పటికే తన మద్దతుదారులు మరియు అనుచరులతో చర్చించారని తెలుస్తుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిరాశకు గురైందని, టిఆర్‌ ఎస్‌ కు వ్యతిరేకంగా పోరాడేందుకు కూడా ముందు రావడం లేదు అని, దీనితో ఆయనే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అలాగే తెలంగాణాలో జాతీయ పార్టీల హావ ఏ మాత్రం పనిచేయడం లేదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ ఎస్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలి అంటే ..బలమైన ప్రాంతీయ పార్టీ అవసరం అని అయన తన అనుచరుల వద్ద తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అలాగే రేవంత్ రెడ్డి కొత్త పార్టీని ప్రకటిస్తే ...ఆయనకి తమ మద్దతు ప్రకటించడానికి అనేక మంది ఎన్నారైలు, హార్డ్కోర్ తెలంగాణ పారిశ్రామిక వేత్తలు ఆయన్ని అన్ని విధాలా ఆదుకోవడానికి ఎదురు చూస్తున్నారు.

మొత్తంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుండి బయటకి వచ్చి ...మరో కొత్త పార్టీ ప్రకటిస్తే , అయన పార్టీలో భారీగా చేరికలు ఉండవచ్చు అనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ లో కూడా రేవంత్ వర్గం ఉంది. ఆ వర్గం మొత్తం కాంగ్రెస్ కొత్త పార్టీలోకి జంప్ అవ్వచ్చు. అలాగే కాంగ్రెస్ లో చాలామంది అసంతృప్త నేతలు ఉన్నారు. వారు కూడా రేవంత్ కే జై కొట్టే అవకాశం ఉంది. ఇక ఎలాగూ ..గతంలో అయన టీడీపీ లో కీలకనేతగా ఉన్నారు కాబట్టి ..అప్పటి పరిచయాలని ఉపయోగిస్తే ..టీడీపీ మాజీ నేతలు కూడా పార్టీలో చేరే అవకాశం ఉంది. మొత్తంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులని గమనిస్తే రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ..చూడాలి మరి ఏమౌతుందో ...