Begin typing your search above and press return to search.
రేవంత్, కేసీఆర్ భేటీ!!
By: Tupaki Desk | 2 Nov 2015 11:16 AM GMTఏపీ రాజధాని అమరావతి నగర శంకుస్ధాపన కార్యక్రమం ఇద్దరు ముఖ్యమంత్రులను దగ్గర చేసిన సంగతి తెలిసిందే. అప్పటివరకు ఉప్పు నిప్పులా ఉన్న వారిద్దరినీ ఆ శుభకార్యం మిత్రులుగా మార్చింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అలాంటిదే మరో రాజకీయ వైరిజంటను ఇంకో శుభకార్యం కలపబోతున్నట్లు సమాచారం. తెలంగాణలో ఢీ అంటే ఢీ అనుకుని.. ఇంకా శత్రుత్వం కొనసాగిస్తున్న టీడీపీ నేత రేవంత్ రెడ్డి - తెలంగాణ సీఎం కేసీఆర్ ల మధ్య తెల్ల జెండా ఎగరబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరూ సయోధ్యకు రానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు రేవంత్ కుమార్తె వివాహం వేదిక కానున్నట్లు సమాచారం.
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుకు, తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. అలాంటిది వారిద్దరూ మొన్నటి నుంచి దోస్తులయ్యారు. దాంతో టీడీపీకి చెందిన తెలంగాణ నేత రేవంత్ మొదట్లో మండిపడినా తరువాత సూక్ష్మం బోధపడి తాను కూడా కేసీఆర్ తో విరోధం మానుకోవాలని అనుకుంటున్నారట. చంద్రబాబు మార్గంలోనే పయనించి తానూ ఒక శుభ ముహూర్తాన కేసీఆర్ కు స్నేహం హస్తం చాచాలనుకుంటున్నారు. ఓటుకు నోటు కథ దాదాపుగా ముగిసిపోవడంతో ఇక వైరం ఎందుకని భావిస్తున్నారు . ఇందులో భాగంగానే వచ్చే నెల లో జరగనున్న తన కుమార్తె పెళ్లికి కేసీఆర్ ను ఆహ్వనించాలని రేవంత్ అనుకుంటున్నారట. రేవంత్ పిలిస్తే కేసీఆర్ కూడా వెళ్తారని తెలుస్తోంది.