Begin typing your search above and press return to search.
బాబుపై రేవంత్ ఎందుకు రగిలిపోతున్నాడంటే....
By: Tupaki Desk | 25 May 2017 4:53 AM GMTదూకుడు మనస్తత్వం, అధికార టీఆర్ ఎస్ పార్టీపై పదునైన విమర్శలు చేయడంలో ముందుండే తెలంగాణ టీడీపీ రథసారథి రేవంత్ రెడ్డికి తన పార్టీ అధినేత చంద్రబాబుపై కోపమొచ్చిందా? ఈ క్రమంలో కారాలు మిరియాలు నూరుతూ పరోక్షంగా చంద్రబాబును ఇరకాటంలో పడేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. దీనికంతటికీ పొత్తుల విషయంలో రేవంత్ ను లెక్కలోకి తీసుకోకుండా చంద్రబాబు తన సొంత నిర్ణయం తీసుకోవడమే కారణమని తెలుస్తోంది.
రాజకీయ విశ్లేషకుల సమాచారం ప్రకారం టీడీపీ-బీజేపీ పొత్తు ఏపీకే పరిమితమని.. తెలంగాణలో ఎవరి దారి వారిదే అని ఏపీ సీఎం చంద్రబాబు, బీజేపీ అగ్రనేతలు పరస్పర అంగీకారానికి వచ్చేశారట. అయితే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డికి ఈ విషయం చెప్పకుండానే చంద్రబాబు తన కోటరీలోని ఓ ఇద్దరు మంత్రుల ద్వారా నిర్ణయించేశారట. ఇంత కష్టపడుతున్నా తనకు తెలీయకుండానే చంద్రబాబు పొత్తులపై తీసుకున్న నిర్ణయంపై రేవంత్ ఆగ్రహంగా ఉన్నారట. తనను పట్టించుకోని తీరుపై అసహనం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి పరోక్షంగా దాన్ని వెళ్లగక్కేశారని ప్రచారం జరుగుతోంది. అమిత్ షా టూర్ కు ఒకరోజు ముందే రేవంత్ రెడ్డి అన్ని మీడియాలను పిలిచి బీజేపీతో దాదాపు తెగతెంపులే అని ఇంటర్వ్యూలు ఇచ్చేసింది ఇందులో భాగమేనని చెప్తున్నారు. అత్యంత ఆసక్తికరంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సైతం అదే రోజు టీడీపీతో తెలంగాణలో పొత్తు ఉండకపోవచ్చుననే మాటను తెలిపారు.
కేవలం పొత్తులతోనే అపేయని రేవంత్ రెడ్డి ఎన్నడూ లేని విధంగా జనసేన అధినేత పవన్ వినిపిస్తున్న ఉత్తరాది అహంకారం నినాదానికి మద్దతు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. దీంతో పాటుగా బీజేపీపై నేరుగా విమర్శలు సైతం గుప్పించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు కూడా బీజేపీ అమలు చేయడం లేదని.. తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని రేవంత్ మండిపడ్డారు. మిత్రపక్షంగా ఉన్న బీజేపీని సాఫ్ట్ కార్నర్ లోనే ఎదుర్కుందామని బాబు చెప్పినప్పటికీ దానికి కమిట్ అవ్వకుండా కమలాన్ని టార్గెట్ చేస్తుండటం వెనుక రేవంత్ మనోవేధన కారణమని అంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/