Begin typing your search above and press return to search.

నాడు కేసీఆర్ ను తిట్టి.. రేవంత్ ఇప్పుడిలా..

By:  Tupaki Desk   |   29 March 2019 4:31 AM GMT
నాడు కేసీఆర్ ను తిట్టి.. రేవంత్ ఇప్పుడిలా..
X
నిండా మునిగాక కానీ తత్త్వం భోదపడదంటారు.. ఎన్నికల్లో గెలవడానికి బలం - బలగంతోపాటు కాసింత అదృష్టం - నమ్మకాలు తోడవ్వాలంటారు అందుకే ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులందరూ ముహూర్తాలు - జాతకాలు - శకునాలు - వర్ఝాలు చూసి మరి వేస్తుంటారు. ఇవి తెలంగాణ రాష్ట్రసమితి అధినేత కేసీఆర్ లో ఇంకా కాస్త ఎక్కువ. అదే ఆయన బలం.. బలహీనత.. కానీ ప్రత్యర్థులకు ఇదో విమర్శనాస్త్రం..

పోయిన దఫాలో సీఎం కేసీఆర్ సచివాలయానికి వెళ్లకపోవడం.. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి బేగంపేటలో వాడిన సీఎం అధికారిక నివాసాన్ని వాస్తు బాగాలేదని వాడకపోవడం.. ఆరునెలల్లోనే ‘ప్రగతి భవన్ ’ నిర్మించడం లాంటివి చేశారు.దీనిపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేంవత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలంతా ఆడిపోసుకున్నారు. కేసీఆర్ కు వాస్తు పిచ్చి అంటూ అవహేళన చేశారు. రేవంత్ అయితే ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు.. కట్ చేస్తే..

ఇప్పుడు రేవంత్ మారిపోయాడు.. ఒక్క ఓటమితో కేసీఆర్ దారిలోకి వచ్చాడు. వాస్తు మహిమ ఎంత ఉంటుందో రేవంత్ కు అర్థమైంది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ లో తిరుగేలేదనుకున్న రేవంత్ చిత్తుచిత్తుగా ఓడిపోయాడు. ఇప్పుడు మల్కాజిగిరి నుంచి ఎంపీ బరిలో ఉన్నారు.ఈ నేపథ్యంలో గెలుపు కోసం కేసీఆర్ చూపిన బాటలో నడిచారు.

తాజాగా రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ లో ఉన్న సొంత ఇంటికి వాస్తు మార్పులు చేయించాడు. కొద్దిరోజుల కిందటే పనిమొదలు పెట్టగా.. తాజాగా అవి పూర్తయ్యాయి. కొడంగల్ లో ఓటమికి ముందు వరకూ ఇంటి కి దక్షిణం వైపు ప్రధాన ద్వారం ఉండేదట.. అది వాస్తు రిత్యా అపశకునం అని పండితులు చెప్పారు. దీంతో ఆ దారిని మూసివేయించి ఇప్పుడు ఉత్తరం మూల ఈశాన్యంలో ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేయించాడు. అలాగే ఇంట్లోని వాష్ రూం సహా వాస్తు మార్పులన్నింటిని చేయించాడు. ఇలా రేవంత్ కూడా కేసీఆర్ ను తిట్టిన నోటితోనే ఆయన పాటించిన వాస్తును పాటిస్తూ పూర్తిగా మారిపోవడం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడిక కేసీఆర్ ను వాస్తు విషయంలో రేవంత్ అస్సలు తిట్టడనడంలో ఎలాంటి సందేహం లేదు.