Begin typing your search above and press return to search.
కేసీఆర్ దత్తత గ్రామంలో రేవంత్ పర్యటన
By: Tupaki Desk | 22 Feb 2016 9:42 AM GMT తెలంగాణలో టీఆరెస్ ఆకర్ష్ పథకం దెబ్బకు టీడీపీ విలవిలలాడుతున్నా ఆ పార్టీ నేత రేవంత్ రెడ్డి మాత్రం ప్రభుత్వంపై ఎదురుదాడి విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. ఇంకా కొత్త కొత్త అస్త్రాలు సమకూర్చుకోవడానికి రెడీ అవుతున్నారు. అందులో భాగంగానే ఆయన టీఆరెస్ అధినేత, సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామానికి వెళ్లి అక్కడ అభివృద్ధి ఎలా ఉందన్నది పరిశీలిస్తున్నారు.
అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనక్కు తగ్గకుండా మరింతగా ఎదిరించాలని రేవంత్ అంటుంటారట.. ఇప్పుడు అందుకోసమే కావొచ్చు.. ఆయన కరీంనగర్ జిల్లాలోని చిన్న ముల్కనూరు వెళ్లారు. అది కేసీఆర్ దత్తత గ్రామం కావడంతో అక్కడి పరిస్థితి ఏంటనేది చూడ్డానికి ఆయన వెళ్లారు. చిన ముల్కనూరు రూపరేఖలే మార్చేస్తానని అప్పట్లో దత్తత సమయంలో కేసీఆర్ చెప్పారు. ఆయన మాటలు ఎంతవరకు నిజమయ్యాయో చూడడం... ప్రజలకు చెప్పడం రేవంత్ లక్ష్యంగా కనిపిస్తోంది.
కాగా కేసీఆర్ దత్తత గ్రామానికి రేవంత్ వెళ్లడం టీఆరెస్ నేతలతో పాటు టీడీపీ నేతలనూ ఆశ్చర్యపరుస్తోంది.