Begin typing your search above and press return to search.
టీడీపీ చేసింది టీఆర్ ఎస్ చేయలేకపోయింది!
By: Tupaki Desk | 17 Dec 2016 6:17 AM GMTతెలంగాణ అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు అనూహ్య ఘటన ఒకటి చోటుచేసుకుంది. సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు అంటేనే హడావిడి. అందులోనూ తొలిరోజు చెప్పక్కర్లేదు. సందడే సందడి. శాసనసభ్యులు - శాసనమండలి సభ్యులు - మంత్రులు - ఉన్నతాధికారులు ఇతర నేతలు అంతా హంగూ అర్భాటంగా కనిపిస్తారు. ఉత్సాహాంగా వస్తారు. మొదటిరోజు తమ వైఖరులను తెలియజేస్తూ పలు రకాల కార్యక్రమాలను చేపడతారు. కొందరు పాదయాత్ర చేస్తే - మరికొందరు సైకిళ్ల మీద చేరతారు. ఇంకొందరు సింపుల్ గా బస్సులో నుంచి దిగుతారు. ముఖ్యమంత్రి - మంత్రుల కాన్వాయ్ ల సంగతి సరేసరి. అయితే ఈ దఫా టీడీపీ సంప్రదాయం పాటించగా టీఆర్ ఎస్ తన ఆలోచనలను మార్చుకున్నట్లుగా ఉందని అంటున్నారు.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి నివాళులు అర్పించి అసెంబ్లీలోకి వచ్చారు. కానీ అధికార టీఆర్ ఎస్ పార్టీ అమరవీరులను పక్కనపెట్టేసింది. సాధారణంగా మంత్రులు - ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం దగ్గరకు వెళ్లి నివాళులు అర్పించే సంస్కృతి ఉండేది. ఈమారు ఇటు అధికార టీఆర్ ఎస్ - అటు ప్రతిపక్షాలు సైతం అమరవీరులను స్మరించుకోకుండానే లోనకు వెళ్లిపోయారు. వారిని మరచిపోయారా ? కావాలనే విస్మరించారా అనే విషయంలో భిన్నమైన వ్యాఖ్యానాలు వినిపించాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సాధారణంగా ఉండే పోలీసుల భద్రతా తనిఖీల హడావిడి తప్ప - రాజకీయ పార్టీల సందడి లేకపోవడంపై ఒకింత చర్చ చోటుచేసుకున్నది. అసెంబ్లీ లోపల పెద్దనోట్ట రద్దుపై చర్చ జరిగితే, బయట మాత్రం అమరువీరులను టీఆర్ ఎస్ సర్కారు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నదనే వ్యాఖ్యానాలు రావడం గమనార్హం. మరోవైపు మిగతా పార్టీల నేతలు ఎలాంటి వింతలు - విశేషాలు లేకుండానే లోపలికి వచ్చేశారు. ప్రధానంగా కాంగ్రెస్ - టీడీపీ - బీజేపీ ఎమ్మెల్యేలు చడీచప్పుడు లేకుండా అసెంబ్లీ హాల్ లోకి వెళ్లిపోయారు. లాబీల్లోనూ పెద్దగా కనిపించలేదు. అంతకుముందు తమ తమ పార్టీ కార్యాలయాల్లోకి వెళ్లి, కొద్దిసేపు తమ సభ్యులతో చర్చించుకుని ఇటు అసెంబ్లీకి - అటు మండలికి చేరుకున్నారు. ప్రతిసారి ఏదో ఒక వింత కార్యక్రమంతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నంలో ప్రతిపక్షపార్టీలు ఉండేవి. ఈమారు ఆ ఆసక్తి అంతగా వాటిలో కనిపించలేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/