Begin typing your search above and press return to search.

రేవంత్ వర్సెస్ కేటీఆర్.. రసవత్తర రాజకీయం..

By:  Tupaki Desk   |   23 Nov 2018 11:44 AM GMT
రేవంత్ వర్సెస్ కేటీఆర్.. రసవత్తర రాజకీయం..
X
తెలంగాణ రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. ముఖ్యంగా భావి రాజకీయ నేతలుగా పేరొందిన కేటీఆర్ - రేవంత్ రెడ్డిలు నువ్వా నేనా అన్నట్టు వారి పార్టీల కోసం పోరాడుతున్నారు. వ్యూహ ప్రతి వ్యూహాలతో ఒకరినొకరు దూసుకుపోతున్నారు. కొడంగల్ లో రేవంత్ ను ఓడించాలని ఇప్పటికే కేటీఆర్ పర్యటించి బహిరంగ సభలు పెట్టి - రోడ్ షో నిర్వహించి అక్కడ ప్రజలను కోరారు. ఇక టీఆర్ ఎస్ శ్రేణులంతా కొడంగల్ లోనే తిష్టవేసి వ్యూహాలు పన్నుతున్నారు. ఈసారి కొడంగల్ లో రేవంత్ ను ఓడించాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

తాజాగా తనను టార్గెట్ చేసిన కేటీఆర్ కు కూడా షాకిచ్చేందుకు రేవంత్ రెడీ అయ్యారు. కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించి తనను ఎండగట్టిన కేటీఆర్ కు పోటీగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించాలని రేవంత్ డిసైడ్ అయ్యారు. ఈ మేరకు సిరిసిల్లలో ప్రచారానికి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగడం విశేషం. ఈ పరిణామాలతో తెలంగాణ రాజకీయాల్లో పోరు కేటీఆర్ వర్సెస్ రేవంత్ లా మారింది.

ఇన్నాళ్లు పొత్తులు - నామినేషన్లు - అసమ్మతి - తిరస్కరణలు జరిగాయి. ఇప్పుడు ప్రచారంపై పార్టీలు ఫుల్ పోకస్ పెట్టాయి. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసెడెంట్ అయిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ అంతటా పర్యటనలకు శ్రీకారం చుట్టారు. అధిష్టానం - రాహుల్ గాంధీ అప్పజెప్పిన బాధ్యతలను భుజాన వేసుకొని ముందుకు వెళుతున్నారు.

అందులో భాగంగా తనను కొడంగల్ లో టార్గెట్ చేసిన కేటీఆర్ ను ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో ఓడించాలని అక్కడ ప్లాన్ చేశారు. సిరిసిల్లలో కేటీఆర్ పై న్యాయవాది కేకే మహేందర్ రెడ్డి పోటీచేస్తున్నారు. ఈయన టీఆర్ ఎస్ రెబల్ గా 2009లో కేటీఆర్ పై కేవలం 171 ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోయాడు. కేటీఆర్ కు టఫ్ ఇస్తాడన్న పేరు ఉండడంతో ఈయనకు మద్దతుగా రేవంత్ రంగంలోకి దిగారట.. 26న ఫుల్ ఫోకస్ సిరిసిల్లలోనే పెట్టి కేటీఆర్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయనున్నారట.. కేకే గెలుపును రేవంత్ భుజాన వేసుకున్నాడట..సిరిసిల్లలో వరుస పర్యటనలకు స్కెచ్ గీశారు. బహిరంగ సభ - రోడ్ షోలు నిర్వహించి ఎండగట్టాలని చూస్తున్నాడు. దీంతో కేటీఆర్ ను ఇరుకున పెట్టాలని రేవంత్ వేసిన ప్లాన్ ఏమేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి మరి..