Begin typing your search above and press return to search.
బద్ధలు కానున్న రేవంత్ సైలెన్స్!
By: Tupaki Desk | 12 Feb 2018 3:57 PM GMTఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి చాలా కాలమే అయింది. నెలలు గడచిపోతున్నాయి. ఏదో అడపాదడపా ప్రెస్ మీట్ లు పెట్టి.. కాంగ్రెసులో తాను కూడా ఒక నాయకుడిని ఉన్నా అని అస్తిత్వాన్ని నిరూపించుకోవడం మినహా.. దూకుడుగా.. తనదైన శైలిలో కేసీఆర్ సర్కారు మీద యుద్ధాన్ని ప్రకటించడం అనేది ఇప్పటిదాకా జరగలేదు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత.. మంచి ముహూర్తాలు చూసుకుని.. డిసెంబరు 9వ తేదీ వరకు గాంధీభవన్ పాదం కూడా మోపకుండా కొన్ని వారాలు గడిపేసిన.. రేవంత్ రెడ్డి.. తాను పూర్తిస్థాయిలో యుద్ధరంగంలోకి దిగడానికి మరికొన్ని నెలలు గడిపేశారు. ఇప్పుడు కూడా మంచి ముహూర్తాల రోజుల కోసమే ఆగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 18, 20 తేదీల తర్వాత.. రేవంత్ సైలెన్స్ బద్ధలవుతుందని తెలుస్తోంది.
రేవంత్ రెడ్డి అంటేనే తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్. ఓటుకు నోటు వ్యవహారంలో వీడియో కెమెరాల సాక్షిగా పోలీసులకు దొరికిపోయినప్పటికీ.. అరెస్టు అయి జీపు ఎక్కుతూ తొడకొట్టి మీసం మెలేసి.. కేసీఆర్ అంతం చూస్తానని సవాళ్లు విసిరిన చరిత్ర రేవంత్ కు మాత్రమే ఉంది. కొన్నాళ్లు జైల్లో గడిపి బెయిలుపై బయటకు వచ్చినా... తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేసీఆర్ మీద ఒక రేంజిలో విరుచుకుపడుతూ.. రేవంత్ చెలరేగిపోయే వారు. కానీ.. తెదేపాలోనే విభిన్న మైన పరిస్థితులు కొన్ని వర్గాలకు చెందిన నాయకులు కేసీఆర్ అనుకూలురుగా ఉండడం.. ఇత్యాది పరిణామాల నేపథ్యంతో పాటూ.. ఆ పార్టీలోభవిష్యత్తు ఉండదనే భయంతో రేవంత్ రెడ్డి కాంగ్రెసులోకి మారారు.
స్థానిక నాయకత్వాన్ని బైపాస్ చేసి డైరక్ట్ రాహుల్ తో డీల్ సెట్ చేసుకుని.. ఆయన సమక్షంలోనే పార్టీలో చేరారు. రాహుల్ ను తన జిల్లాకు తీసుకువచ్చి భారీ బహిరంగ సభ పెట్టించి బ్యాంగ్ తో పార్టీ యాక్టివిటీ ప్రారంభించాలని అనుకున్నారు గానీ... అది కార్యరూపం దాల్చలేదు. కాస్త ఆగేసరికి నెలలు గడచిపోతున్నాయి. దాంతో ఇక లాభం లేదనుకుని ఆయన త్వరలోనే యాక్టివేట్ కావడానికి నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
మరో వారం రోజుల వ్యవధిలో రేవంత్ సారథ్యంలో రాష్ట్రవ్యాప్త పోరాటానికి ఒక ప్రణాళిక ను ప్రకటిస్తారని.. అక్కడినుంచి సర్కారు మీద రేవంత్ మార్కు దూకుడు ప్రారంభం అవుతుందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.