Begin typing your search above and press return to search.

సీత‌క్క కాంగ్రెస్ ఎంట్రీ వెనుక రేవంత్ వైఫ్‌?

By:  Tupaki Desk   |   1 Nov 2017 5:31 AM GMT
సీత‌క్క కాంగ్రెస్ ఎంట్రీ వెనుక రేవంత్ వైఫ్‌?
X
తెలంగాణ రాజ‌కీయాల్లో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న అతి కొద్దిమందిలో రేవంత్ రెడ్డి ఒక‌రు. నిన్న‌టి వ‌ర‌కూ టీటీడీపీకి ఆశాకిర‌ణంగా ఉన్న రేవంత్ నిన్న (మంగ‌ళ‌వారం) ఢిల్లీలో కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ స‌మ‌క్షంలో పార్టీ మారిన సంగ‌తి తెలిసిందే.

రేవంత్ తో పాటు ప‌లువురు నేత‌లు పార్టీలో చేరారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. టీడీపీ పాలిట్ బ్యూరో స‌భ్యురాలు.. ములుగు మాజీ ఎమ్మెల్యే సీత‌క్క కాంగ్రెస్ గూటికి చేర‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. మొన్న‌టి వ‌ర‌కూ (సోమ‌వారం రాత్రి) త‌ట‌స్థంగా ఉన్న ఆమె అప్ప‌టిక‌ప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరాల‌న్న నిర్ణ‌యాన్ని ఎందుకు తీసుకున్నారు? ఆమె అలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌టం వెనుక ఉన్న‌ది ఎవ‌రు? అన్న ప్ర‌శ్న‌లు వేసుకుంటే ఆస‌క్తిక‌ర స‌మాధానం రావ‌టం ఖాయం

ఇప్ప‌టివ‌ర‌కూ రేవంత్ రాజ‌కీయాల్ని మాత్ర‌మే చూసిన వారికి.. తాజాగా రేవంత్ వైఫ్ రాజ‌కీయం ఎలా ఉంటుంద‌న్న విష‌యం అనుభ‌వంలోకి వ‌చ్చింది. ఢిల్లీలో రాహుల్ గాంధీ స‌మ‌క్షంలోరేవంత్ పార్టీ చేర‌నున్న వేళ‌.. వీలైనంత గ్రాండ్ గా ఉండాల‌న్న ప్ర‌య‌త్నాల్లో రేవంత్ అండ్ కో ఉన్నారు. ఇందుకు సంబంధించిన భారీ క‌స‌ర‌త్తే చేశారు.

రేవంత్ తో పాటు ఆయ‌న స‌తీమ‌ణి క‌దిపిన పావులతో.. పార్టీని విడిచిపెట్ట‌నంటే విడిచిపెట్ట‌న‌న్న సీత‌క్క పార్టీ మారటంలో కీల‌క‌భూమిక పోషించిన‌ట్లు చెబుతున్నారు. సోమ‌వారం రాత్రి వ‌ర‌కూ సీత‌క్క తెలుగుదేశం పార్టీలోనే ఉన్నా.. అర్థ‌రాత్రి వేళ జ‌రిగిన మార్పుల‌తో ప‌రిస్థితి ఒక్క‌సారిగా మారిపోయింది.

సోమ‌వారం సీత‌క్క త‌న స్వ‌గ్రామ‌మైన ములుగు మండ‌లం జ‌గ్గ‌న్న‌పేట‌కు వ‌చ్చారు. అయితే.. కార్య‌క‌ర్త‌ల్ని క‌ల‌వ‌కుండా ఆమె హ‌న్ముకొండ వెళ్లిపోయారు. ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ కావ‌టంతో అయోమ‌యానికి గురి చేసింది. ఇలాంటి వేళ‌.. అనూహ్య ప‌రిణామం చోటు చేసుకుంది. రేవంత్ రెడ్డి స‌తీమ‌ణి సోమ‌వారం అర్థ‌రాత్రి వేళ‌లో సీత‌క్క ఇంటికి వెళ్లిన‌ట్లుగా స‌మాచారం. ఆమెపై ఒత్తిడి తీసుకురావ‌టంతో పాటు.. కాంగ్రెస్ పార్టీలో చేరేలా ఆమెను ఒప్పించిన‌ట్లు స‌మాచారం. రేవంత్ వైఫ్ చెప్పిన మాట‌ల‌తో మ‌న‌సు మార్చుకున్న సీత‌క్క‌.. ఆమెతో పాటు అప్ప‌టిక‌ప్పుడు హైద‌రాబాద్‌కు బ‌య‌లుదేశారు.

తెల్ల‌వారుజాముకు హైద‌రాబాద్‌ కు చేరుకున్న ఆమె.. ఉద‌య‌మే ఢిల్లీకి ప‌య‌న‌మై.. మ‌ధ్యాహ్నం వేళ‌కు రేవంత్ తో పాటు రాహుల్ గాంధీ స‌మ‌క్షంలో పార్టీలో చేరిపోయారు. ఇప్ప‌టివ‌ర‌కూ రేవంత్ వెనుక మాత్ర‌మే ఉన్న ఆయ‌న స‌తీమ‌ణి ఇప్పుడు అందుకు భిన్నంగా చురుగ్గా వ్య‌వ‌హ‌రించ‌ట‌మే కాదు.. పార్టీ మార్చ‌టంలో కీల‌క‌భూమిక పోషిస్తున్న తీరు చూస్తుంటే.. రానున్న రోజుల్లో ఆమె కూడా రాజ‌కీయ ఎంట్రీ ఇవ్వ‌నున్నారా? అన్న ప్ర‌శ్న త‌లెత్త‌టం ఖాయం.