Begin typing your search above and press return to search.
కేసీఆర్ కు కంటి ఆపరేషన్..రేవంత్ స్పందన!
By: Tupaki Desk | 11 Sep 2017 2:00 PM GMTతెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ను విమర్శించేందుకు ఏ అవకాశం దొరకుతుందా అని ఎదురుచూసే టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ - ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఈ క్రమంలో తాజాగా కేసీఆర్ కు జరిగిన కంటి ఆపరేషన్ ను సైతం వదులుకోలేదు. కొద్దికాలంగా కంటి సమస్యతో బాధపడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రికి ఢిల్లీలో శస్త్రచికిత్స జరిగింది. ఆయన ఆరోగ్యం బాగుందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. సుప్రసిద్ధ కంటి వైద్య నిపుణుడు - పద్మశ్రీ అవార్డు గ్రహీత సెంటర్ ఫర్ సైట్ (సీఎఫ్ ఎస్) చైర్మన్ డాక్టర్ మహిపాల్ ఎస్ సచ్ దేవ్ కేసీఆర్ కు ఆపరేషన్ ను నిర్వహించారు.
అయితే ఈ సందర్భంగా కేసీఆర్ పై తనదైన చతురతతో కూడిన పోస్ట్ ఒకటి రేవంత్ రెడ్డి పెట్టారు. ఫేస్ బుక్ లోని తన అధికారికి అకౌంట్లో ``కంటి ఆపరేషన్ పూర్తయినందుకు శుభాకాంక్షలు. ఇకనైనా సమస్యలు కనిపిస్తాయని ఆశిస్తూ...రేవంత్ రెడ్డి` అని పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. పదులకొద్దీ షేర్లు - వందలాది కామెంట్లు వచ్చాయి. చిత్రంగా ఇటు తెలుగుదేశం అభిమానులు - అటు టీఆర్ ఎస్ వర్గాలు సైతం ఈ పోస్ట్ ను షేర్ చేయడం విశేషం. ఇప్పటికైనా రాష్ట్ర సమస్యలను స్పందించాలని ఆకాంక్షిస్తూ రేవంత్ రెడ్డి పెట్టిన పోస్ట్ గుర్తు చేస్తోందని టీడీపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా పేదలు - ప్రజలు - సామాన్యుల దృష్టి సారించాలని, ఒంటెత్తు పోకడలు మానేయాలని కోరుతున్నారు. అయితే అదే సమయంలో టీఆర్ ఎస్ అభిమానులు సైతం ఈ పోస్టుపై, రేవంత్ పై విరుచుకుపడుతున్నారు. తమ నాయకుడు ఆపరేషన్ కు ముందు చూసిన చూపుతోనే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి దొరికిపోయారని - ఆయన పార్టీ అధ్యక్షుడు అయిన చంద్రబాబు అమరావతికి పారిపోయారని విరుచుకుపడుతున్నారు.