Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌లో `శ‌శి` మంట‌లు.. రేవంత్ అడ్డంగా దొరికిపోయారే!

By:  Tupaki Desk   |   17 Sep 2021 10:30 AM GMT
కాంగ్రెస్‌లో `శ‌శి` మంట‌లు.. రేవంత్ అడ్డంగా దొరికిపోయారే!
X
అస‌లే అంతంత మాత్రంగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త‌.. ఇప్పుడు మ‌రోసారి సంక‌టం లోకి ప‌డింది. రాష్ట్ర కాంగ్రెస్ సార‌థిగా.. రేవంత్‌రెడ్డి నియామ‌కాన్ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న వారికి ఇప్పుడు ఆయుధాలు దొరికిన‌ట్ట‌యింది. ఇటీవ‌ల రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన‌.. కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనం తపురం ఎంపీ శశిథరూర్‌‌.. తెలంగాణ ప్ర‌భుత్వాన్ని కొనియాడారు. ఐటీ రంగంలో చేస్తున్న కృషిని ఆయ‌న ప్ర‌శంసించారు. ఐటీ రంగానికి సంబందించిన పార్ల‌మెంట‌రీ స్థాయీ సంఘం చైర్మ‌న్ హోదాలో శ‌శి చేసిన ఈ వ్యాఖ్య‌ల‌పై రేవంత్‌.. స్పందించ‌డ‌మే.. ఇప్పుడు ఆయ‌న‌కు ఇబ్బందిక‌రంగామారింది.

శ‌శిథ‌రూర్‌.. తెలంగాణ ప్ర‌భుత్వాన్ని కొనియాడ‌డం జీర్ణించుకోలే పోయిన‌.. రేవంత్ త‌న స‌హ‌జ ధోర‌ణిలో.. విమ‌ర్శ‌లు గుప్పించారు. శ‌శిథ‌రూర్‌ను గాడిద‌తో పోల్చారు. దీనిపై మంత్రి కేటీఆర్ మ‌రింత తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. రేవంత్‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. క్రిమిన‌ల్ అంటూ.. వ్యాఖ్యానించారు. స‌రే.. ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే..కాంగ్రెస్‌లోనూ రేవంత్ వ్యాఖ్య‌లపై తీవ్ర దుమార‌మే లేచింది. శ‌శిథ‌రూర్ అంత‌టి సీనియ‌ర్‌ను గాడిద అంటూ.. రేవంత్ సంబోధించ‌డాన్ని.. ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు.

శ‌శిని కించ‌ప‌రిచేలా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం సబబుకాదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానిం చారు. శశి థరూర్ సీనియర్ పార్లమెంటేరియన్, మేధావిగా మంచి గుర్తింపు కలిగిన నాయకుడని అన్నారు. ఆయన వ్యక్తితత్వం రాజకీయాల్లో అందరికీ ఆదర్శవంతమని కొనియాడారు. అలాంటి వ్యక్తినుద్దేశించి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఓ సీనియర్ కాంగ్రెస్‌ నాయకుడిగా తనను బాధించాయ న్నారు. శశి థరూర్‌పై రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ ఆడియో టేపు సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో కోమటిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

శశి థరూర్ నుంచి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ ఆడియో టేపు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ఏమని స్పందిస్తారంటూ రాహుల్ గాంధీని ప్రశ్నిస్తూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో శశిథరూర్‌ను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. శశి థరూర్‌కు ఫోన్ చేసి తన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తంచేసినట్లు వెల్లడించారు. అటు రేవంత్ రెడ్డి నుంచి తనకు ఫోన్ వచ్చినట్లు తెలిపిన శశి థరూర్.. రేవంత్ రెడ్డి క్షమాపణను అంగీక రిస్తున్నట్లు చెప్పారు. ఈ వివాదానికి ఇంతటితో ఫుట్ స్టాప్ పెడుతున్నట్లు వ్యాఖ్యానించారు. తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరూ కలిసి పనిచేస్తామన్నారు.

ఈ నేపథ్యంలో మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్‌పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ట్వీట్ చేయడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పీసీసీ అధ్యక్ష పదవి తనకు దక్కకపోవడం పట్ల కోమటిరెడ్డి గుర్రుగా ఉన్న విష‌యం తెలిసిందే. రేవంత్ రెడ్డికి పీసీసీ సారథ్య పగ్గాలు అప్పగించడంపై తన అసంతృప్తిని బాహటంగానే వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శశిథరూర్‌పై రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు కోమటిరెడ్డికి బాగా క‌లిసి వ‌చ్చాయ‌ని.. అంటున్నారు ప‌రిశీల‌కులు.