Begin typing your search above and press return to search.

చంద్రబాబుపై రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్

By:  Tupaki Desk   |   30 Aug 2021 1:03 PM GMT
చంద్రబాబుపై రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్
X
తెలంగాణ రాజకీయాల్లో దూసుకొచ్చిన రేవంత్ రెడ్డికి చరిత్ర చెడగొడుతోంది. టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టి కాంగ్రెస్ కు ఊపు తీసుకొచ్చిన రేవంత్ రెడ్డికి గత పరిణామాలు ఇబ్బంది కరంగా మారాయి. రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి రావడంతో ఇప్పుడు ప్రత్యర్థులు దాన్నే టార్గెట్ గా పెట్టుకుంటున్నారు. ఇక ఓటుకు నోటు కేసులో ఇరుక్కోవడం ఆయనకు మైనస్ గా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు అనుంగ శిష్యుడిగా ముద్రపడ్డ రేవంత్ ఇప్పుడు ప్రత్యర్థులు ఈ విషయంలోనే టార్గెట్ అవుతున్నాడు.

ఇప్పటికే తనకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబేనని రేవంత్ రెడ్డి చాలా సార్లు చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే ఇటీవల మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. కాంగ్రెస్ కు ఎవరు దిక్కులేక టీడీపీనుంచి అరువు తెచ్చుకున్నారని.. చంద్రబాబే పీసీసీ చీఫ్ ను నియమించారని.. ఆయన శిష్యుడే రేవంత్ అని ఆరోపించారు.

ఈ క్రమంలోనే తనపై టీడీపీ, చంద్రబాబు ముద్ర పోయేందుకు రేవంత్ రెడ్డి పూనుకున్నారు. ఈ క్రమంలోనే టీడీపీపైన, చంద్రబాబుపైన సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు తెలంగాణలో టీడీపీనే లేదని.. తెలంగాణలో చంద్రబాబుకు పని లేదని రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబును అమితంగా అభినందించే రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనమయ్యాయి. టీడీపీని పరిపుష్టం చేసేందుకు చంద్రబాబు హైదరాబాద్ లోనే ఉండి మంత్రాంగం చేస్తున్న నేపథ్యంలో తాజాగా రేవంత్ రెడ్డి చేసిన హాట్ కామెంట్స్ టీడీపీ అభిమానులను హర్ట్ చేశాయి.

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ సర్కార్ పైనా.. సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ పైనా విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే టీడీపీ జాతీయ అధ్యక్షుడు , త్రీటైమ్స్ సీఎం , 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుపై అనూహ్య వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో చంద్రబాబుకు పార్టీ లేదా? ప్రణాళిక లేదా? అని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

తెలంగాణ ప్రజల కోసం పనిచేయడానికే టీడీపీ నుంచి బయటకు వచ్చానని రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ విలువను గౌరవిస్తున్నానన్న రేవంత్ రెడ్డి.. టీడీపీ అధినేత చంద్రబాబును తాను ఎందుకు తిట్టాలని ప్రశ్నించారు. తాను తిట్టడం లేదని తనను చంద్రబాబు మనిషి అంటున్నారని చెప్పుకొచ్చాడు. తెలంగాణకు బద్ద వ్యతిరేకి అని రాజశేఖర్ రెడ్డినో తిట్టి జగన్ తో సఖ్యతతో ఉంది మీరు కాదా? అని కేసీఆర్ ను ప్రశ్నించారు. జగన్ ను కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి కేసీఆర్ ఆహ్వానించారని గుర్తు చేశారు.

అసలు తెలంగాణతో చంద్రబాబుకు సంబంధం లేదని.. ఏ సంబంధం లేని చంద్రబాబును తాను ఎందుకు తిట్టాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తాను సోనియా గాంధీ మనిషిని అని.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని అని రేవంత్ అన్నారు.

ఇక నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో రాజీవ్ రైతు భరోసా దీక్ష చేపట్టి విజయవంతం చేయడం ద్వారానే ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు తనపై నమ్మకం ఏర్పడిందని రేవంత్ రెడ్డి సంచలన విషయాలు చెప్పుకొచ్చాడు. రైతులంతా కదిలివచ్చి రాజీవ్ రైతు దీక్షను విజయవంతం చేయడంతోనే తనకు పీసీసీ పదవి వచ్చిందని స్పష్టం చేశారు.