Begin typing your search above and press return to search.

రేవంత్ ది టీడీపీ అయితే కేసీఆర్ ది ఏంటి?

By:  Tupaki Desk   |   1 July 2021 9:32 AM GMT
రేవంత్ ది టీడీపీ అయితే కేసీఆర్ ది ఏంటి?
X
తెలంగాణ కాంగ్రెస్ నేత మల్లు రవి గట్టి పాయింట్ ను దొరకబట్టాడు. ఊరికే విమర్శలు చేస్తున్న టీఆర్ఎస్ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. దీంతో ఇప్పుడు గులాబీ శ్రేణులు కూడా డిఫెన్స్ లో పడిపోయేలా చేశాడు. ఇంతకీ అసలు వివాదం ఏంటంటే.. ఇటీవలే టీపీసీసీ చీఫ్ అయిన రేవంత్ రెడ్డిని టీడీపీ నేత అంటూ పలువురు విమర్శిస్తున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సైతం టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ కు కాంగ్రెస్ పదవి ఇచ్చారని ఎద్దేవా చేశారు.

దీనికి మల్లు రవి గట్టి కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి వచ్చి అధ్యక్షులు అయితే సీఎం కేసీఆర్ కూడా టీడీపీ నుంచి వచ్చి టీఆర్ఎస్ కు అధ్యక్షుడు అయ్యారని మల్లు రవి గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి మీద కేసులున్నాయని అంటున్నానని.. సీఎం కేసీఆర్ మీద సీబీఐ కేసులు లేవా? అంటూ ప్రశ్నించారు. అందుకోసమే కేసీఆర్ కేంద్రంలోని ప్రధాని మోడీ, అమిత్ షా వద్ద ఒంగి ఒంగి దండాలు పెట్టడం లేదా అంటూ ఎద్దేవా చేశారు.

రేవంత్ రెడ్డిని టీడీపీ బూచీ చూపెట్టి రాజకీయంగా అణగదొక్కాలని చూస్తున్న వారికి చెంపపెట్టులా కాంగ్రెస్ నేతలు జవాబిస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వకపోవడంతోనే ఇప్పటి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించి ఒంటరిగా పోరాటం చేసి ఇప్పుడు తెలంగాణ సాధించాడు.

అదే టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి సైతం ఇప్పుడు కాంగ్రెస్ పీసీసీ చీఫ్ అయ్యి తెలంగాణ సీఎం పీఠమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. దీంతో రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్న వాళ్లకు కేసీఆర్ సైతం ఓ మాజీ టీడీపీ నేత అన్నది గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.