Begin typing your search above and press return to search.

వైరల్: ఒలింపిక్స్ లో అబ్బాయిలు, అమ్మాయిల ప్రతీకారం

By:  Tupaki Desk   |   5 Aug 2021 4:30 PM GMT
వైరల్: ఒలింపిక్స్ లో అబ్బాయిలు, అమ్మాయిల ప్రతీకారం
X
ఈసారి ఒలింపిక్స్ భారత్ కు మిశ్రమ ఫలితాలే వచ్చాయి. స్వర్ణం నెగ్గకపోయినా రజతం, కాంస్య పతకాలతో మన భారత జట్లు, క్రీడాకారులు సత్తా చాటారు. అయితే ఈసారి కొన్ని అద్భుతమైన ప్రతీకార పోరులు ఒలింపిక్స్ లో కనువిందు చేశాయి. వాటిని చూసి సోసల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా హాకీ పురుషుల , మహిళల జట్లు సాగించిన ప్రయాణంపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.

భారత పురుషుల,మహిళల హాకీ జట్లు విజయం సాధించిన జట్లు చూస్తే అబ్బాయిలు, అమ్మాయిలు ప్రతీకారం తీర్చుకున్నట్టే కనిపిస్తోందని సోషల్ మీడియాలో ఒక పోస్టు వైరల్ అవుతోంది. అమ్మాయిలను ఓడించిన వారు అబ్బాయిలను.. అబ్బాయిలను ఓడించిన వారిని అమ్మాయిలు ఓడించిన తీరు చూసి నెటిజన్లు ముచ్చట పడుతున్నారు. మొత్తంగా ఈ ప్రతీకారం పంతంలో మన భారతీయ జట్లు విజయతీరాలకు చేరాయని అంటున్నారు.

ముందుగా మన భారత మహిళా హాకీ జట్టు బ్రిటన్ చేతిలో ఓడిపోయింది. అయితే మన పురుషుల భారత హాకీ జట్టు అదే బ్రిటన్ ను ఓడించి ముందుడుగు వేసింది. మన మహిళలను ఓడించినందుకు ప్రతీకారం తీర్చుకుంది.

ఇక పురుషుల హాకీ జట్టు ఆస్ట్రేలియా చేతిలో లీగ్ దశలో ఓడిపోగా.. మన మహిళల జట్టు అదే ఆస్ట్రేలియాను క్వార్టర్ ఫైనల్ లో ఓడించి ఇంటిదారి పట్టించింది.

ఇక అర్జెంటీనా మహిళల జట్టు చేతిలో మన మహిళా జట్టు ఓడిపోగా.. పురుషుల జట్టు అదే అర్జెంటీనాను ఓడించి ప్రతీకారం తీర్చుకుంది. ఇక మహిళల జట్టు జర్మనీ చేతిలో ఓడిపోతా.. కాంస్యం కోసం జరిగిన పోరులో మన పురుషుల హాకీ జట్టు అదే జర్మనీని ఓడించి విజయం సాధించింది.

దీన్ని బట్టి మనకు ఏం అర్థమైందంటే.. మన పురుషుల, మహిళల హాకీ జట్లు ఒకరినొకరు ప్రతీకారంతో రగిలిపోయారని.. తమ జట్లను ఓడించిన వారిని ఓడించి ప్రతీకారం తీర్చుకున్నాయని అర్థమవుతోంది. ఇప్పుడు ఈ రీవేంజ్ డ్రమాను సోషల్ మీడియాలో నెటిజన్లు షేర్లు చేస్తూ తెగ సందడి చేస్తున్నారు. పురుషుల, మహిళల జట్లు ఒకరినొకరు సహకరించుకుంటూ ముందుకువెళుతున్నాయని చెబుతున్నారు.

* సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పోస్టు ఇదే..
Wow what a scenario in this Olympics in Indian hockey,
Girls lost to Great Britain
Boys beat them.
Boys lost to Australia
Girls beat them.
Girls lost to Argentina
Boys beat them.
Girls lost to Germany
Boys beat them