Begin typing your search above and press return to search.

ఏపీ దేవదాయశాఖ పరువు పాయే..

By:  Tupaki Desk   |   6 Aug 2021 10:16 AM GMT
ఏపీ దేవదాయశాఖ పరువు పాయే..
X
దేవతలకు, భక్తులకు మధ్య దేవదాయశాఖ వారధిగా ఉంటుంది. భక్తలుకు అవసరమైన సేవలు అందిస్తూ వారికి దైవదర్శనం కలిపిస్తారు. ఎంతో నిష్టతో శుచి, శుభ్రంగా దేవాలయానికి వచ్చే భక్తులు దేవుడిని దర్శనం చేసుకొని ఆ తరువాత తమకు తోచినంత మొత్తాన్ని హుండీలో వేస్తారు. కొందరు సంపన్నులు తమకు నచ్చిన విధంగా విరాళాలు ఇస్తారు.ఇలా ప్రతి గుడికి వచ్చిన విరాళాలతో దేవాలయ అభివృద్ధి చేసి, భక్తులకు మరిన్న సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత దేవాదాయ శాఖ అధికారులపై ఉంటుంది. కానీ ప్రభుత్వ అధికారులు అనగానే సక్రమమైన ఉద్యోగులతో పాటు అక్రమంగా వ్యవహరించే ఉద్యోగులుంటారని అనుకుంటారు. కానీ దేవుడు కొలువై ఉండే దేవాదాయశాఖలోనూ వక్రబుద్ధి కలిగిన ఉద్యోగులు ఉన్నారని ఏపీలో జరుగుతున్న పరిణామాలను చూస్తే అర్థమవుతోంది.

ఆంధ్రప్రదేశ్ కు చెందిన దేవాదాయ శాఖ గత కొన్ని రోజులుగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. దేవాదాయ శాఖ కు చెందిన నిధులు, ఆదాయం పక్కదారి పడుతుందనే ప్రచారం సాగుతోంది. కొందరు అధికారులు దేవాలయాల్లో ఉండే హుండీల సొమ్మును కూడా జేబులో వేసుకుంటున్నారన్న ఆరోపణలు తీవ్రంగా రావడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఈ మేరకు కొందరు అధికారులను కూడా సస్పెండ్ చేశారు.

విశాఖ జిల్లాలోని పలు ఆలయాల్లోని హుండీ సొమ్మ పక్కదారి పడుతోంది. ఈ విషయం బయటపడడంతో ఆశాఖకు చెందిన ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. విచారణలో విస్తుగొలిపే విషయాలు తెలియడంతో ముందుగా అనకాలపల్లి ఇన్ స్పెక్టర్ శ్రీనివాసరాజును సస్పెండ్ చేశారు. ఆయితే శ్రీనివాసరాజు గురించి తెలిసిన అధికారులు షాక్ కు గురయ్యారు. అనకాపల్లి డివిజన్ కు ఇన్ స్పెక్టర్ అయిన శ్రీనివాసరాజు అత్యున్నత సమావేశాలకు కూడా హాజరవడం గమనార్హం. విజయనగరం మాన్సాస్ ట్రస్టు , సింహాచలం భూములపై ప్రత్యేక కమిటీ విచరాణకు ఏర్పాటు చేస్తున్న సమావేశాలకు హాజరయ్యారు. ఈ విషయం తెలిసిన డిప్యూటీ కమిషనర్ పుష్పవర్దన్ ఆయనను సస్పెండ్ చేశారు.

అత్యున్నత సమావేశాలకు ఏ అధికారంతో హాజరయ్యావో తెలపాలని మెమోలు జారీ చేశారు. శ్రీనివాసరాజు సస్పెండ్ చేసిన కొద్ది రోజులకే విశాఖపట్నం డివిజన్ ఇన్ స్పెక్టర్ శ్రీధర్ సస్పెండ్ కు గురయ్యారు. ఆయన ఆయల హుండీల లెక్కంపు కాగానే తాళాలు అప్పగించకుండా జాప్యం చేశారనే ఆరోపణలపై ఏసీ శాంతి ఆయనను విధుల నుంచి తప్పించారు. అయితే ఇలాంటి పనులు చేసిన సస్పెండ్ కు గురైనా వారు మళ్లీ విధుల్లోకి రావడానికి తీవ్ర ప్రయత్నాలు జరగుతున్నారు. వారికి డీసీ పుష్పవర్దన్ సహకరిస్తున్నారని ప్రచారం సాగుతోంది.

అయితే వీరి ప్రయత్నాలు తీవ్రం కావడంతో విభేదాలు రచ్చకెక్కాయి. దీంతో వీటిని చక్కదిద్దాల్సిన బాధ్యతను రాజమండ్రి ఆర్జేసికి నాటి కమిషనర్ అర్జునరావు బాధ్యతలు అప్పగించారు. కానీ అది సాధ్యం కాలేదు. ఇదిలా ఉండగా డీసీ పుష్పవర్దన్ విధులకు ఎక్కువగా గౌర్హాజరవుతున్నారు. విశాఖ పట్నం డీసీ శ్రీధర్ సస్పెండ్ కు గురైన తరువాత తన గురించి బయటపడుతుందని వారానికి మూడు రోజులే విధులకు వస్తున్నారట. అంతేకాకుండా ఈ వ్యవహారంలో ఎవరినైనా విడిచిపెట్టేది లేదని ఏసీ శాంతి వార్నింగ్ ఇవ్వడంతో పుష్పవర్దన్ ఎక్కువగా కనిపించడం లేదని ప్రచాచం సాగుతోంది.

ఇక ఈశాఖలో పనిచేస్తున్న కొందరు అధికారులు కిందిస్థాయి ఉద్యోగులను సొంత పనులకు వాడుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కార్యాలయాల్లో విధులు నిర్వహించాల్సిన చాలా మంది సిబ్బంది ఇళ్లల్లో ఇతర పనులు చేస్తూ కనిపిస్తున్నారు. ఓ ఆలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న వ్యక్తి ఓ అధికారికి వాహన డ్రైవర్ గా ఉన్నాడు. ప్రభుత్వం నుంచి వచ్చే వాహన అలవెన్స్ లను జేబులో వేసుకొని కింది స్థాయి సిబ్బందిని డ్రైవర్ గా పెట్టుకోవడంపై చర్చనీయాంశంగా మారింది.