Begin typing your search above and press return to search.
ప్రపంచంలోనే ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐ ఆదాయం ఎంతో తెలుసా?
By: Tupaki Desk | 21 Nov 2022 2:30 AM GMTప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రికెట్ బోర్డు బీసీసీఐ. అందుకే ప్రపంచ క్రికెట్ ను బీసీసీఐ శాసిస్తోంది. అన్ని జట్లపై ఆర్థికంగా ప్రభావం చూపిస్తోంది. ఐసీసీకి భారత్ జట్టు లేకపోతే ఆదాయం లేనట్టే. అందుకే టీమిండియా గ్రూప్ ను ఈజీగా పెట్టి అవతలిపక్క టఫ్ గా పెడుతున్నారని ఆరోపణలున్నాయి. ఇటీవల టీ20 కప్ సందర్భంగా భారత్ కు అనుకూలంగా అంపైర్లు, ఐసీసీ వ్యవహరించిందని పాకిస్తాన్ మాజీలు నిప్పులు చెరిగారు. మరి ఇంతగా ధనిక బోర్డు అయిన బీసీసీఐ ఆదాయం ఎంత? ఏడాదికి ఎంత సంపదిస్తున్నది అందిరిలోనూ ఒక ప్రశ్నగా ఉంది. దీనిపై స్పెషల్ ఫోకస్.
ప్రపంచంలోనే సంపన్నబోర్డు అయిన బీసీసీ ఆదాయం ఏడాదికి ఏకంగా రూ.3730 కోట్లు. ఒక్క బీసీసీఐ వద్దనే ఇలా మూడు వేల కోట్లపైగా సంపద ఉంది. మిగతా బోర్డులు రెవెన్యూ పరంగా బీసీసీఐకి ఆమడ దూరంలో ఉన్నాయి. ఐపీఎల్ విజయవంతం కావడంతో బీసీసీఐ ఖజానా భారీగా నిండుతూనే ఉంది.
ఇక బీసీసీఐ తర్వాత సంపన్న క్రికెట్ బోర్డు ‘ఆస్ట్రేలియా’. దీని రెవెన్యూ కూడా ఏకంగా రూ.2843 కోట్లు. అంటే రెండింటికి తేడా సుమారు వెయ్యి కోట్లు అన్న మాట.ఇక ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు 3వ స్థానంలో ఉంది. దీని ఆదాయం రూ.2135 కోట్లు. ఇక ఆ తర్వాత రూ.811 కోట్లతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు 4వ స్థానంలో ఉంది. ఇక ఆ తర్వాత రూ.802 కోట్లతో బంగ్లాదేశ్ జట్టు 5వ స్థానంలో ఉంది. ఇక ఆ తర్వాత సౌతాఫ్రికా 425 కోట్లు, న్యూజిలాండ్ 210 కోట్లు, వెస్టిండీస్ 116 కోట్లు, జింబాబ్వే 113 కోట్లు, శ్రీలంక 100 కోట్లతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
తొలి టీ20 వరల్డ్ కప్ ముగిశాక మన దేశంలో ‘ఐపీఎల్’కు తెరదీశారు. అప్పటి నుంచి ప్రపంచంలోని అన్ని దేశాల క్రికెటర్లు ఈ లీగ్ లో ఆడాలని కలలుకంటారు. ఆస్ట్రేలియాలోని బిగ్ బాష్ లీగ్, ఇంగ్లండ్ నిర్వహించే ‘ది హండ్రెడ్’ ఇతర లీగులతో పోలిస్తే ఐపీఎల్ వేల కోట్ల సామ్రాజ్యం. వాటికంటే మన ఆదాయమే ఎక్కువ. ప్రపంచంలోనే అత్యంత ధనిక లీగ్ గా ఐపీఎల్ ముద్రపడింది. ఐపీఎల్ ద్వారానే ప్రపంచ క్రికెట్ లో పలువురు క్రికెటర్లు చోటు సంపాదించి ఆయా దేశాల తరుఫున పాపులర్ అయ్యారు. ఐపీఎల్ ద్వారానే సూర్యకుమార్ యాదవ్ వెలుగులోకి వచ్చారు.