Begin typing your search above and press return to search.
విషమించిన వరవరరావు ఆరోగ్య పరిస్థితి ..హుటహుటిన ఆసుపత్రికి తరలింపు !
By: Tupaki Desk | 30 May 2020 5:30 AM GMTవిప్లవ రచయితల సంఘం నేత వరవరరావు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధాని మోడీకి కుట్ర కేసులో పుణె పోలీసులు అతనిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది నుంచి జైలులోనే ఉంచి.. బెయిల్ కూడా ఇవ్వడం లేదు. తలోజా జైలులో ఉన్న వరవరరావు ఆరోగ్యం బాగోలేకపోవడంతో జేజే ఆష్పత్రికి తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితి గురించి ముంబై పోలీసులు చిక్కడ పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు వరవరరావు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వరవరరావు అనారోగ్య పరిస్థితి దృష్యా ఆయనను కలుసుకునేందుకు గాను కుటుంబసభ్యులు ముంబయి వెళ్ళేందుకు అనుమతించినట్టు హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ప్రకటించారు. వరవరరావు కుటుంబసభ్యుల ప్రయాణ ఏర్పాట్ల గురించి ప్రత్యేకంగా ఓ డీసీపీ కోర్డినేట్ చేస్తున్నట్టు కమిషనర్ చెప్పారు.
మహారాష్ట్రలోని పుణె సమీపంలో గల భీమా-కోరెగావ్‌లో 2018 జనవరి 1న 'పీష్వాలపై దళితుల విజయం ద్విశతాబ్ది ఉత్సవాల నిర్వహణ సందర్భంగా హింస చెలరేగింది. ఆ హింసలో ఒక వ్యక్తి చనిపోగా, పోలీసులు సహా పలువురు గాయపడ్డారు. హింసను ప్రేరేపించారన్న ఆరోపణలపై హిందూ సంస్థల ప్రతినిధులు శంభాజీ భిడే, మిలింద్ ఏక్బోటేలపై కేసు నమోదు చేశారు. వీరు పట్టణాల్లో మావోయిస్టులని పోలీసులు ఆరోపించారు. వారి ఇళ్లలో కొన్ని ఎలక్ట్రానిక్ స్టోరేజీ పరికరాలు, సీడీలు, స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ప్రింట్ అవుట్లను పరిశీలించగా.. రాజీవ్‌గాంధీ హత్య తరహాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని హత్య చేయటానికి నక్సలైట్లు కుట్ర పన్నిన విషయం వెల్లడైందని తెలిపారు.
2018 ఆగస్టు 28న.. విప్లవ రచయితల సంఘం నేత పెండ్యాల వరవరరావు సహా.. పలువురు హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు, రచయితల ఇళ్లల్లో మహారాష్ట్ర పోలీసులు సోదాలు చేశారు. హైదరాబాద్ నుంచి వరవరరావును అరెస్ట్ చేసి తమతో పాటు పుణె తీసుకెళ్లారు. భీమాకోరేగావ్ అల్లర్లకు సంబంధించి జూన్‌లో అరెస్టు చేసిన వారిలో కొందరు మావోయిస్టు సానుభూతిపరులు ఉన్నారని.. వారంతా ప్రధానమంత్రి మోదీ హత్యకు కుట్ర పన్నారని.. వారికి వరవరరావు ఆర్థికంగా సహకరిస్తున్నారని మహారాష్ట్ర పోలీసుల అభియోగం మోపారు