Begin typing your search above and press return to search.
తెలంగాణ కాంగ్రెస్ ప్రక్షాళన.. యువ మంత్రం
By: Tupaki Desk | 27 Jun 2021 5:30 AM GMTకాంగ్రెస్ లో ప్రక్షాళన మొదలైంది. మొత్తానికి అధిష్టానం పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించి పెద్ద సాహసమే చేసిందని చెప్పొచ్చు. టీడీపీ నుంచి వలస వచ్చిన రేవంత్ రెడ్డి దీటైన నేతగా గుర్తించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీలో సీనియర్లు వద్దని వారిస్తున్నా.. అసమ్మతి గళం వినిపించినా కాంగ్రెస్ అధిస్టానం వెనక్కి తగ్గలేదు..రేవంత్ రెడ్డి నియామకంపై ఎలాంటి అభ్యంతరాలున్నా పట్టించుకోకుండా కాంగ్రెస్ అధిష్టానం తాను అనుకున్నది చేసి చూపించింది. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్తేజం చిగురిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇన్నాళ్లు జవసత్వాలు లేకుండా పోయిన పార్టీకి పునరుత్తేజం వస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
రేవంత్ రెడ్డికి పీసీసీ ఇస్తే మేం సహకరించమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి, హనుమంతరావు, జగ్గారెడ్డి, జానారెడ్డి వంటి వారు వారిస్తున్నా అధిష్టానం పట్టించుకోలేదు. ఇంకొందరు పార్టీ నుంచి వెళ్లిపోతామని బెదిరించినా బెదరలేదు. మొత్తానికి సీనియర్లను తోసిరాజని ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణమే ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ రాష్ర్ట విషయాలను అవపోసన పట్టారు. పార్టీలో ఎవరెవరు ఏం చేస్తున్నారో అనే దానిపై స్పష్టమైన నివేదికలు తెప్పించుకున్నారు. కొందరైతే అధికార పార్టీకి దాసోహమని కాంట్రాక్టులు సైతం తెచ్చుకుంటున్నట్లు ఆయన దృష్టికి వచ్చింది. దీంతో వారి మనుగడ ప్రశ్నార్థకమయ్యే అవకాశముంది. కేసీఆర్ తో లాలూచి పడి పార్టీ సిద్దాంతాలను పక్కనపెడుతున్న వారిపై చర్యలుంటాయని భావిస్తున్నారు.
కాంగ్రెస్ లో ఉద్ధండులైన నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కుసుమ కుమార్ తదితరులను పక్కన పెట్టడం సంచలనంగా మారింది. పార్టీకి వీరి సేవలు అవసరమని గుర్తించి వారికి ఎన్నో పదవులు ఇచ్చారు. కానీ చివరికి పీసీసీ అధ్యక్ష పదవికి వచ్చే సరికి మాత్రం అధిష్టానం అనుకున్నదే చేసిందని చెబుతున్నారు. వీరికి జాతీయ కమిటీలో కూడా ఏ రకమైన స్థానం ఇవ్వకపోవడం గమనార్హం.
కేసీఆర్ ను ఢీకొనే సత్తా గల వారి కోసం అధిష్టానం అన్వేషణ సాగించింది. ఇందులో రేవంత్ రెడ్డికే ఎక్కువ మార్కులు పడినట్లు తెలుస్తోంది. అందుకే ఆయన అభ్యర్థిత్వంపై సానుకూల నిర్ణయం వెలువడినట్లు భావిస్తున్నారు. ఇందులో ఎవరికి కూడా ఒక్క పదవి ఇవ్వకుండా జాగ్రత్త పడింది. పూర్తి స్థాయి బాధ్యతలు రేవంత్ రెడ్డికి అప్పగించడంలో పార్టీ దూరదృష్టి దాగుందని విశ్లేషకులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీని సరైన దారిలో నడిపించే విధంగా భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్నారు.
ఇటీవల కేసీఆర్ ను కలిసిన మల్లు భట్టి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి సహా నేతలకు రేవంత్ రెడ్డి కార్యవర్గంలో చోటు దక్కలేదు. వీరంతా కేసీఆర్ కు ఫేవర్ గా రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ అధిష్టానం భగ్గుమన్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఇప్పుడు కేసీఆర్ ను ఢీకొట్టే.. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చే యువ బ్యాచ్ కు పట్టం కట్టినట్టుగా తెలుస్తోంది. రేవంత్ రెడ్డి కార్యవర్గంలో అంతా ఫైర్ బ్రాండ్స్ ఉండడంతో వీరిపై బోలెడు అంచనాలు పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. మరీ వీరు ఆ అంచనాలు అందుకుంటారా? నెరవేరుస్తారా? అన్నది వేచిచూడాలి.