Begin typing your search above and press return to search.
రేవంత్ పీసీసీ చీఫ్: కాంగ్రెస్ సీనియర్ల నెక్ట్స్ స్టెప్ ఏంటి?
By: Tupaki Desk | 27 Jun 2021 8:51 AM GMTమొత్తానికి కళ్లు కాయలు రాసి పండ్లు అయ్యి పుచ్చిపోయేదాకా వెయిట్ చేయించి మరీ నిర్ణయాలు తీసుకోవడం కాంగ్రెస్ అధిష్టానానికి అలవాటు అని దేశ రాజకీయాల్లో ఓ సెటైర్ ఉంది.. తెలంగాణ రాష్ట్రాన్ని సైతం ఎన్నో కమిటీలు, కాలయాపనల తర్వాతే కాంగ్రెస్ అధిష్టానం విసిగించి విసిగించి ఇచ్చేసింది. ఇప్పుడు పీసీసీ చీఫ్ విషయంలోనూ అదే జరిగింది..
టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకాన్ని కాంగ్రెస్ సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. వీహెచ్, కోమటిరెడ్డి, జగ్గారెడ్డిలు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఇక కాంగ్రెస్ సీనియర్లకు టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వడం మంచిది కాదని వ్యాఖ్యానించారు. అయితే రేవంత్ రెడ్డినే ఇప్పుడు టీపీసీసీ చీఫ్ గా నియమించడాన్ని కాంగ్రెస్ సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విశేషం ఏంటంటే సీనియర్లు అందరినీ పక్కనపెట్టి రేవంత్ రెడ్డి సహా యువ బ్యాచ్ కే కార్యవర్గంలో చోటిచ్చారు. రేవంత్ రెడ్డికి యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. యువతను , తటస్థ ఓటర్లను పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ వైపు తిరిగేలా అతడు చూడలగలడని.. ఇది కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడానికి దోహదపడుతుందని భావిస్తున్నారు.
రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ చేయడాన్ని వి.హనుమంతరావు లాంటి వారు జీర్ణించుకోవడం లేదు. తమ అభ్యంతరాలను కాంగ్రెస్ అధిష్టానం కనికరం లేకుండా పక్కన పెట్టిందని ఆరోపిస్తున్నారు. సీనియర్లను పట్టించుకోవడం లేదని అంటున్నాడు. ఇక మరో సీనియర్ నేత షబ్బీర్ అలీకి ఇది పెద్ద షాక్ గా చెబుతున్నారు. షబ్బీర్ ను కాదని మహ్మద్ అజారుద్దీన్ కు కమిటీలో పెద్దపీట వేయడాన్ని ఆయన జీర్ణించుకోవడం లేదు. అజారుద్దీన్ ఇప్పుడు కాంగ్రెస్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. టీఆర్ఎస్ తో కలుస్తున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వివాదంలో చిక్కుకున్నాడు. అయినప్పటికీ షబ్బీర్ అలీని కాదని మైనార్టీ వర్గంలో అజారుద్దీన్ కు ప్రాధాన్యం ఇవ్వడాన్ని జీర్ణించుకోవడం లేదట..
టీకాంగ్రెస్ లో సీనియర్లు అయిన జీవన్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య వంటి నాయకులను అయితే పూర్తిగా పట్టించుకోలేదు. వారు తమ రాజకీయ జీవితంలో చివరి దశలో ఉన్నారు. అందువల్ల వారిని విస్మరించడమే మేలు అని హైకమాండ్ భావించినట్టుంది. మరో కాంగ్రెస్ నాయకుడు కే.జానారెడ్డి ఇప్పటికే నాగార్జున సాగర్ లో ఓడిపోయి రిటైర్ మెంట్ కు దగ్గరలో ఉన్నారు. తన కొడుకును పార్టీలో నిలబెట్టే ప్రయత్నంలో ఉన్నాడు. అందుకే హైకమాండ్ కూడా ఈసారికి ఈ సీనియర్ జానారెడ్డిని పక్కనపెట్టేసిందంటున్నారు.
ఇక పాత పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సైతం ఎలాంటి పదవులు ఇవ్వలేదు. వారంతా కూడా గుర్రుగానే ఉన్నారంటున్నారు. వారందరు ఇక తప్పుకోవాలని హైకమాండ్ ఈ నియామకాలతో స్పష్టంగా సూచించినట్టైంది. మరి టీకాంగ్రెస్ నాయకులు గమ్మున ఉంటారా? రేవంత్ కు సహకరిస్తారా? తిరుగుబావుటా ఎగరవేస్తారా? అన్నది వేచిచూడాలి. రేవంత్ రెడ్డికి ప్రస్తుతం యువ బ్యాచ్ ను ఇచ్చింది. వారంతా తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేస్తారని అంటున్నారు. పాత కాంగ్రెస్ కాపులను అంతా బయటకు పంపడంతో వారు ఏం చేస్తారన్నది ఆసక్తి రేపుతోంది.