Begin typing your search above and press return to search.

రేవంత్ రాజ‌కీయంః నొప్పింపిక‌.. తానొవ్వొక‌..

By:  Tupaki Desk   |   29 Jun 2021 4:30 PM GMT
రేవంత్ రాజ‌కీయంః నొప్పింపిక‌.. తానొవ్వొక‌..
X
రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ రాకుండా సీనియ‌ర్లు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేశారో అంద‌రికీ తెలిసిందే. కానీ.. పార్టీయే ముఖ్య‌మని భావించిన అధిష్టానం.. అన్ని విష‌యాల‌నూ మ‌దించి, ఫైన‌ల్ గా రేవంత్ కే ప‌ట్టాభిషేకం చేసింది. నిర‌స‌న‌లు గట్టిగానే త‌గులుతాయ‌ని భావించిన‌ప్ప‌టికీ.. ఆశ్చ‌ర్య‌క‌రంగా అంద‌రూ సైలెంట్ అయిపోవ‌డం గ‌మ‌నార్హం. చివ‌రి వ‌ర‌కు రేసులో నిలిచిన కోమ‌టిరెడ్డి త‌ప్ప‌.. ఎవ్వ‌రూ అసంతృప్తి వ్య‌క్తం చేయ‌లేదు.

అయితే.. రేవంత్ మాత్రం త‌న‌దైన రాజ‌కీయం మొద‌లు పెట్టాడు. సీనియ‌ర్లుగా ఉన్న‌వారంతా బ‌య‌ట‌కు క‌నిపించ‌క‌పోయినా.. లోప‌ల మాత్రం ర‌గిలిపోతున్నార‌నే విష‌యం తెలిసిందే. దీంతో.. వారిని కూల్ చేసే ప‌నిలో ప‌డ్డాడు. వ‌రుస‌గా సీనియ‌ర్లంద‌రినీ క‌లిసి వారి అహం చ‌ల్లార్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న వీహెచ్ ను క‌లిసిన సంగ‌తి తెలిసిందే. ఈ విధంగా అంద‌రినీ కూల్ చేస్తున్నారు.

ఇదిలాఉండ‌గా.. నిన్న కొత్త పీసీసీ క‌మిటీ స‌మావేశ‌మైంది. సీనియ‌ర్ ఉపాధ్య‌క్షుడు మ‌ల్లుర‌వి నివాసంలో ఈ భేటీ జ‌రిగింది. ఈ స‌మావేశంలో పీసీసీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ క‌మిటీ చైర్మ‌న్ దామోద‌ర రాజ‌న‌ర్సింహా, కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షులు అంజ‌న్ కుమార్‌, గీతారెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. పార్టీ నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా ఎవ్వ‌రూ మాట్లాడొద్ద‌ని డిసైడ్ అయ్యారు.

ఈ సంద‌ర్బంగా రేవంత్ అంద‌రినీ క‌లుపుకుపోయే ప్ర‌య‌త్నం చేశారు. అంతేకాదు.. సీనియ‌ర్ల‌ను కూల్ చేసేందుకు తాను అంద‌రిక‌న్నా చిన్న‌వాడిన‌ని చెప్పుకున్నారు. పెద్ద‌ల స‌ల‌హాలు తీసుకొని, అంద‌రినీ క‌లుపుకుపోతాన‌ని చెప్పుకొచ్చారు. ఎలాంటి భేష‌జాలూ లేకుండా ప‌నిచేస్తాన‌ని చెప్పారు. అంద‌రం ఒక క్రికెట్ జ‌ట్టులా క‌లిసి ప‌నిచేస్తామ‌ని అన్నారు.

అదే స‌మ‌యంలో.. తానే ఫైన‌ల్ అనే విష‌యాన్ని కూడా ఇండైరెక్ట్ గా చెప్పారు. తాను ఇప్పుడు ప్యాసింజ‌ర్ ట్రైన్ కు డ్రైవ‌ర్ ను అని చెప్పారు రేవంత్‌. అంతేకాకుండా.. నిన్న‌టి దాకా చూసిన రేవంత్ వేరు.. ఇక నుంచి చూడ‌బోయే రేవంత్ వేరు అని అన్నారు. ఈ స్టేట్ మెంట్ తో కాంగ్రెస్ రాజ‌కీయాల‌ను బాగానే వంటి బ‌ట్టించుకున్నార‌ని అంటున్నారు విశ్లేష‌కులు. నొప్పింప‌క‌.. తానొవ్వ‌కుండా సాగే రాజ‌కీయాన్ని ప్రారంభించార‌ని, మ‌రి, ఇది ఎలా ముందుకు సాగుతుందో చూడాల‌ని అంటున్నారు.