Begin typing your search above and press return to search.
రేవంత్ రెడ్డికి హైకమాండ్ షాక్
By: Tupaki Desk | 10 Aug 2021 10:30 AM GMTకొత్త పాలకవర్గం ఏర్పడిన తరువాత తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ ఏర్పడింది. యూత్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా అయిన తరువాత పార్టీలోని కొందరు సీనియర్ నేతలు కూడా రేవంత్ రెడ్డితో కలిసి నడిచే ప్రయత్నం చేస్తున్నారు. మొన్నటి వరకు టీపీసీసీ ప్రెసిడెంట్ ఎంపిక పై ఉత్కంఠగా సాగినా.. చివరికి రేవంత్ రెడ్డితోనే పార్టీ మనుగడ సాగిస్తుందని భావించిన అధిష్టానం ఆయనకే బాధ్యతలు అప్పగించింది. బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దూకుడు పెంచాడు. ప్రత్యేక సభలు, సమీక్షలు నిర్వహిస్తన్న పాలకవర్గం కేడర్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ నేపథ్యంలో అధిష్టానం తాజాగా రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చింది.. ఢిల్లీ పెద్దల తీరుతో రేవంత్ ప్రయత్నాలు వృథా అవుతున్నాయా..? అని చర్చించుకుంటున్నారు.
రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్న కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్ష పదవి చేపట్టకముందునుంచే టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తూ ప్రత్యేకంగా నిలిచారు. ఇక ఆయనకు పార్టీ బాధ్యతలు అప్పగించిన తరువాత దూకుడు పెంచారు. టీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇటీవల హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన దళిత బంధుకు పోటీగా సోమవారం దళిత గిరిజన దండోరా సభను ఏర్పాటు చేసి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. మరోవైపు పార్టీలో అంతర్గత విభేదాలను తొలగిస్తూ పార్టీ ప్రతిష్టతకు కృషి చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ఇటీవల కాంగ్రెస్ అధిష్టానం బీజేపీ వ్యతిరేక పార్టీలకు విందు ఇచ్చింది. ఈ విందులో టీఆర్ఎస్ నేతలు పాల్గొనడం విశేషం. రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా సాగుతుండగా ఢిల్లిలో మాత్రం కాంగ్రెస్ విందుకు టీఆర్ఎస్ నాయకులు విందుకు హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్రంలో బీజేపీతో ఫైట్ చేస్తూనే కేంద్రంలో మోడీతో సన్నిహితంగా ఉంటున్నారు. ఇటు రాష్ట్ర కాంగ్రెస్ కు వ్యతిరేకం అని చెబుతూ ఢిల్లీలో ఆ పార్టీ ఇచ్చిన విందుకు పార్టీ నాయకులను పంపుతున్నారు. ఈ పరిణమాలతో తెలంగాణ ప్రజల్లో తీవ్ర అయోమయం నెలకొంది.
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్ల ప్రతాపం చూపిన బీజేపీ హూజూరాబాద్ ఉప ఎన్నికలో పాగా వేసుందుకు తీవ్ర ప్రయత్నం చేస్తోంది. కమలం పార్టీకి అస్త్రంగా మారిన ఈటల రాజేందర్ తో తమ పార్టీ బలపడుతుందనే ఆశతో ఉంది. అయితే టీఆర్ఎస్ మాత్రం ప్రభుత్వ పథకాలతో ప్రజలను తనవైపు తిప్పుకుంటోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా సెపరేట్ సమీక్షలు, సమావేశాలు నిర్వహిప్తూ బలోపేతం కోసం కృషి చేస్తోంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ కు ఆదరణ పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఢిల్లీ నాయకులు మాత్రం బీజేపీని ఓడించేందుకు ప్రాంతీయ పార్టీలను కలుపుకుతూ పోతుంది. అయితే తెలంగాణలో వ్యతిరేకంగా ఉన్న టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ఇచ్చిన విందుకు హాజరు కావడంతో మరోసారి కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒక్కటవుతాయా..? అన్న చర్చ సాగుతోంది. గతంలో కేసీఆర్ కాంగ్రెస్ తో కలిసి తెలంగాణ కోసం పోరాటం చేశారు. అయితే బీజేపీని ఓడించేందుకు, కేంద్రంలో కీలకం కావడానికి కేసీఆర్ కొత్త వ్యూహ రచన చేస్తున్నాడా..? అని అనుకుంటున్నారు.
కానీ టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులన్నీ కొందరు బీజేపీలోకి, మరికొందరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు. అయితే టీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే అన్న భావన పార్టీ శ్రేణుల్లోకి వెళితే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నాలు వృథా అవుతాయా..? అని చర్చించుకుంటున్నారు. ఇదే జరిగితే రాను రాను కాంగ్రెస్ పార్టీ మరింత దిగజారే అవకాశాలు లేకపోలేదు. ఇదిలా ఉండగా కేంద్రంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయని ప్రచారం జరిగితే తెలంగాణలో బీజేపికి లాభం చేకూరే అవకాశాలున్నాయిని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.