Begin typing your search above and press return to search.
దిక్కులేక పక్క రాష్ట్రంలో అమ్ముకుంటున్నారు : ప్రభుత్వం పై రేవంత్ రెడ్డి ఫైర్ !
By: Tupaki Desk | 16 Nov 2021 2:30 PM GMTతెలంగాణ రాష్ట్రంలో పండిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ , అధికారులు చెప్పే మాటలకి క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంది. దీనితో సరిహద్దు జిల్లాల రైతులు పక్క రాష్ట్రానికి తీసుకెళ్లి ధాన్యం విక్రయించుకుంటున్నారు. మరోవైపు, ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రైతులు రోడ్డెక్కారు. రాస్తారోకోలు చేసి నిరసన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుత సీజన్ లో సుమారు 6000 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతుల్లో ఆందోళన మొదలైంది.
దీనితో ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులు పొరుగున ఉన్న కర్ణాటకలోని రాయచూర్ కు ధాన్యాన్ని తరలిస్తున్నారు. అక్కడి వ్యాపారులు పచ్చి వడ్లను కూడా కొనుగోలు చేస్తుండడంతో ధర తక్కువైనా అమ్మేసుకుంటున్నారు. ఈ ఏడాది ధాన్యం గ్రేడ్-1 రకానికి రూ.1960, కామన్ రకానికి రూ.1940 కనీస మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, రాయచూర్ మార్కెట్‌లో ఆరిన ధాన్యాన్ని రూ. 1750-1800, పచ్చి వడ్లను రూ. 1550-1600తో కొనుగోలు చేస్తున్నారు. పచ్చి వడ్లు తీసుకెళ్తే కనీసం రూ.400 నుంచి రూ. 450 వరకు తక్కువ ధర వస్తుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర లభించే అవకాశం ఉన్నా.. వర్షాలకు భయపడి రైతులు ధాన్యాన్ని పొరుగు రాష్ట్రంలో అమ్మేసుకుంటున్నారు.
ఇదే అదునుగా కొందరు ప్రైవేట్ వ్యాపారులు రంగంలోకి దిగి తక్కువ ధరకు ఇక్కడ ధాన్యం కొని, కొంత లాభంతో పొరుగు రాష్ట్రంలో అమ్ముకుంటున్నారు. ఈ వ్యవహారం పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకి చెందిన రైతులు కర్ణాటక లోని రాయచూర్ కి వెళ్లి తక్కువ ధరకి అమ్ముకోవాల్సిన ఖర్మ మీ వల్లే వచ్చింది అంటూ ప్రభుత్వం పై ఫైర్ అయ్యాడు. పొరుగు రాష్ట్రాల నుండి పాలమూరు కి వలసలు వస్తున్నాయి అని , డప్పాలు కొట్టిన డ్రామారావు కి అదే పాలమూరు లో మన రైతులు పండించిన ధ్యానాన్ని కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ లో తక్కువ ధరకి అమ్ముకునే దృశ్యం కనిపించడం లేదా అని ప్రశ్నిస్తూ ట్విట్ చేశారు.