Begin typing your search above and press return to search.
రేవంత్ ను వీడని ఓటుకు నోటు కేసు...
By: Tupaki Desk | 13 Aug 2021 3:30 PM GMT2015లో వెలుగులోకి వచ్చిన ఓటుకు నోటు కేసు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన సంగతి తెలిసిందే. శాసన మండలి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసేందుకు గాను ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో నాటి టీడీపీ నేత...నేటి టీపీసీసీ చీఫ్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి రాయబారం నడిపినట్టుగా ఆరోపణలు వచ్చాయి. స్టీఫెన్‌సన్‌కు రేవంత్‌రెడ్డి 50 లక్షలు ఇచ్చినట్టుగా ఆరోపిస్తూ వచ్చిన వీడియోలు కలకలం రేపాయి. ఈ వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబుకూ సంబంధం ఉందంటూ ఆరోపణలు రావడం దుమారం రేపాయి.
దీంతో, ఈ కేసులో రేవంత్‌రెడ్డిపై ఈడీ చార్జ్‌షీట్ దాఖలు చేసి మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. నాటి ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డికి ఓటు వేయాల్సిందిగా స్టీఫెన్‌సన్‌ను రేవంత్ ప్రలోభాలకు గురిచేశారని, రూ.50 లక్షల నగదు ఇస్తూ పట్టుబడ్డారని ఏసీబీ అభియోగం మోపింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ కేసు విచారణలో భాగంగా నాంపల్లి ఏసీబీ కోర్టుకు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. రేవంత్ తో పాటు ఉదయ్‌సింహా, సెబాస్టియన్ లతో సహా పలువురు హాజరయ్యారు.
వేం నరేందర్‌రెడ్డి కుమారుడు కృష్ణ కీర్తన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి మాజీ పీఏ సైదయ్యల వాంగ్మూలాన్ని నమోదు చేశారు. నరేందర్‌రెడ్డి బంధువుతోపాటు మరొకరు గురువారం నాడు విచారణకు హాజరు కాగా వారి వాంగ్మూలాలను కోర్టు రికార్డు చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను సెప్టెంబరు 6వ తేదీకి వాయిదా వేశారు. ఇప్పటికే ఈ కేసులో కొద్ది రోజులు జైలు శిక్ష అనుభవించిన రేవంత్ రెడ్డి... ఆ తర్వాత బయటకు వచ్చి కాంగ్రెస్ లో చేరి ఎంపీగా గెలిచి ఇటీవల టీపీసీసీ పగ్గాలు చేపట్టారు.
ఈ క్రమంలోనే టీఈర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తున్న రేవంత్ రెడ్డి...హుజురాబాద్ ఉప ఎన్నికపై కూడా ఫోకస్ పెట్టారు. ఇంద్రవెల్లిలో భారీ సభ నిర్వహించి గ్రాండ్ సక్సెస్ చేశారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ లపై రేవంత్ విమర్శల నేపథ్యంలోనే సందర్భానుసారంగా ఈ కేసును అధికార పార్టీ తెరపైకి తెస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.