Begin typing your search above and press return to search.

జగన్ మంచోడే.. చుట్టు ఉన్నవాళ్లే చెడగొడుతున్నారు: వర్మ

By:  Tupaki Desk   |   7 Jan 2022 4:43 AM GMT
జగన్ మంచోడే.. చుట్టు ఉన్నవాళ్లే చెడగొడుతున్నారు: వర్మ
X
ఏపీలో సినిమా టికెట్ల విషయంలో టాలీవుడ్ కు, ఏపీ ప్రభుత్వానికి మధ్య వార్ కొనసాగుతోంది. వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ వరుసగా ప్రశ్నలు సంధిస్తూ ఏపీ సర్కార్ ను ఇరుకునపెడుతున్నారు. తాజాగా ట్విట్టర్ లో ప్రభుత్వంపై, మంత్రి పేర్ని నానికి ప్రశ్నలు కురిపిస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా సీఎం వైఎస్ జగన్ పై వర్మ పడ్డాడు.. ‘ప్రభుత్వంతో గొడవ పెట్టుకోవాలన్నది తమ ఉద్దేశం కాదని.. పర్సనల్ గా వైఎస్ జగన్ అంటే తనకు చాలా అభిమానమని’ రాంగోపాల్ వర్మ చెప్పుకొచ్చాడు. కేవలం తమ సమస్యలు తాము సరిగా చెప్పుకోలేక పోవడం వల్లో.. లేక మీరు సినీ పరిశ్రమ కోణం నుంచి అర్థం చేసుకోకపోవడం వల్లో మిస్ అండర్ స్టాండింగ్ ఏర్పడి ఉండొచ్చని రాంగోపాల్ వర్మ వ్యాఖ్యానించారు.

ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానికి తాజాగా వర్మ ట్వీట్ చేశారు. ‘నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు అనుమతిస్తే నేను మిమ్మలను కలిసి మా సమస్యలను వివరిస్తాను. అది విన్న తర్వాత ప్రభుత్వ పరంగా ఆలోచించి సరైన పరిష్కారం ఇస్తారని ఆశిస్తున్నాను’ అంటూ వర్మ వెల్లడించారు. ఇతర నేతల్లా పరుష పదజాలం వాడకుండా డిగ్నిటీతో సమాధానం ఇచ్చినందుకు మంత్రి పేర్ని నానికి వర్మ థ్యాంక్స్ చెప్పడం విశేషం. ఇక వర్మను కలుస్తానని పేర్ని నాని కూడా రిప్లై ఇచ్చాడు.

ఇక జగన్ ను ఉద్దేశించి వరుసగా మూడు ట్వీట్లు చేశాడు వర్మ. నేను ప్రేమించే, గౌరవించే వైసీపీలోని ఒకే ఒక లీడర్ వైఎస్ జగన్ అని వర్మ చెప్పుకొచ్చారు. కానీ మిగతా వైసీపీ నేతలు మిమ్మలను తప్పుదోవ పట్టిస్తున్నారని జగన్ కు వర్మ సూచించారు. వారి స్వప్రయోజనాల కోసం జగన్ ను వాడుకుంటున్నారని ట్వీట్ లో ఆరోపించారు. జగన్ చుట్టూ డేంజరస్ వ్యక్తులు చుట్టుపక్కల ఉన్నారని అన్నారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎప్పటికీ మిమ్మలను ప్రేమిస్తూనే ఉంటుందని.. కానీ మీ చుట్టూ ఉన్న వ్యక్తులే మిమ్మలను మాకు దూరం చేస్తోందని.. వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని జగన్ కు వర్మ సూచించారు.

ఇక తన తల్లి, చెల్లికి జగన్ అంటే చాలా ఇష్టమని.. పోయినసారి జగన్ కే వారు ఓటు వేశారని.. కానీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ విషయంలో ఇప్పుడు మీరు వ్యవహరిస్తున్న తీరు చూసి వారు కూడా షాక్ అవుతున్నారని వర్మ అన్నారు. కొంతమంది మిమ్మలను తప్పుదారి పట్టిస్తున్నారని.. మీడియా కెమెరాల ముందు మిమ్మలను విలన్లు చేస్తున్నారని వర్మ హాట్ కామెంట్స్ చేశారు.