Begin typing your search above and press return to search.
ఆర్జీవీ.. మరీ ఇంత చీప్‌గానా?
By: Tupaki Desk | 7 Dec 2022 2:08 PM GMTదర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ పతనం గురించి మాట్లాడుకునే రోజులు ఎప్పుడో పోయాయి. ఇటీవల సురేష్ బాబు లాంటి అగ్ర నిర్మాత సైతం 'అన్‌స్టాపబుల్' షోలో ఒకప్పటి వర్మ సంచనాలు, ఘనతల గురించి గుర్తు చేసుకున్నారు. కానీ ఇప్పుడు వర్మ ఏంటన్నది అందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఇండియన్ సినిమాలో ఎవ్వరూ చూడని పీక్స్ చూసిన ఆయనే.. ఇప్పుడు ఎవ్వరూ పడిపోలేని కింది స్థాయికి పడిపోయాడన్నది స్పష్టం.
ఫిలిం మేకర్‌గా వర్మ పతనం ఒకెత్తయితే.. వ్యక్తిగా వర్మ చేసే పనులు, చేసే చేష్టలు, మాట్లాడే మాటలు ఆయన అభిమానులకు మరింత వేదన కలిగిస్తున్నారు. ప్రతి దానికీ ఏదో ఒక లాజిక్ తీసి తనను తప్పుబట్టిన వాళ్ల నోళ్లు మూయించడంలో వర్మ దిట్టే కావచ్చు కానీ.. ఆయన్ని అమితంగా ఇష్టపడేవాళ్లందరికీ కూడా తన ప్రవర్తన, చేష్టలు అస్సలు నచ్చట్లేదన్నది అందరూ అంగీకరించే విషయం.
తన సినిమాలను ప్రమోట్ చేసుకునే క్రమంలో ఈ మధ్య వర్మ వేస్తున్న వేషాలు మరీ జుగుప్సాకరంగా ఉంటున్నాయి. వాటికి పరాకాష్ట.. తాజాగా ఆషు రెడ్డితో ఆయన చేసిన ఇంటర్వ్యూ.
తాను తీసిన కొత్త కళాఖండం 'డేంజరస్'ను అసలెవరూ పట్టించుకోక, దానికి బిజినెస్ జరక్క, థియేటర్లు దొరక్క వాయిదాలు వేస్తూ వచ్చిన వర్మ.. ఈ నెల 9కి కొత్త రిలీజ్ డేట్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే సినిమాతో ఏ సంబంధం లేని ఆషు రెడ్డితో ఇంటర్వ్యూ చేశాడు. ఈ ఇంటర్వ్యూ అంతా ఆషు రెడ్డి పాదాల దగ్గరే వర్మ కూలబడి ఉండడం గమనార్హం. ఇందుకు కారణం కూడా ఆయన వివరించారు.
ఇంతకుముందు ఆషుతో చేసిన ఇంటర్వ్యూలో ఆమె తనను కొట్టడం చాలామందిని బాధించిందని, వాళ్లంతా దాన్ని ఎమోషనల్‌గా తీసుకుని తనతో మాట్లాడ్డం కూడా మానేశారని.. అలాంటి వాళ్లకు సమాధానం ఈ ఇంటర్వ్యూ అని.. ఎంతటి వాళ్లయినా అమ్మాయిలకు దాసులే అని చెప్పడానికి తాను ఇలా ఇంటర్వ్యూ చేస్తున్నానని వర్మ అన్నాడు.
ఈ ఇంటర్వ్యూలో ఒక చోట ఆషురెడ్డి కాళ్లకు ముద్దు పెడతా అంటూ పోర్న్ సినిమాల తరహాలో ఆ కాళ్లను ఆయన నాకిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతోంది. ఇంతకంటే దిగజారడు అనుకున్న ప్రతిసారీ వర్మ ఆ ఆలోచన తప్పని రుజువు చేస్తున్నాడంటూ ఆయన తీరును నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆషు రెడ్డిని కూడా తిట్టిపోస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.