Begin typing your search above and press return to search.

జగన్ హీరో : ఆర్జీవీ వ్యూహంలో విలన్లు...?

By:  Tupaki Desk   |   29 Oct 2022 2:30 AM GMT
జగన్ హీరో : ఆర్జీవీ వ్యూహంలో విలన్లు...?
X
రామ్ గోపాల్ వర్మ షార్ట్ కట్ లో ఆర్జీవీ అనబడే సినీ దర్శకుడు నిజానికి చాలా మేధావి. ఆయన అందరూ ఆలోచించినట్లుగా ఆలోచన చేయడు. చాలా కొత్తగా వింతగా ఆలోచిస్తారు. అవి లాజిక్ కి ఒక్కోసారి అందకపోవచ్చు. కానీ ఇలా కూడా జరగవచ్చు కదా అని అనుకోకుండా ఉండలేరు. అలాంటి ఆర్జీవీ ఎన్నో మంచి సినిమాలు తీశారు. శివ లాంటి మూవీ తీసి టాలీవుడ్ ని కొత్త మలుపు తిప్పారు. అయితే ఆర్జీవీ పొలిటికల్ మూవీస్ స్పెషలిస్ట్ గా మారారో మార్చారో తెలియదు కానీ మరో ఏణ్ణర్ధంలో ఏపీలో ఎన్నికలు ఉన్న వేళ ఆయన ఇపుడు ఫుల్ బిజీ అయిపోయారు.

చేతిలో ఏకంగా మూడు సినిమాలు ఉన్నాయని అంటున్నారు. అవన్నీ కూడా రాజకీయ నేపధ్యం ఉన్న సినిమాలే అంటున్నారు. ఇక ఆర్జీవీ ఈ మధ్యనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ని కలసి వచ్చారు. సాధారణంగా ఎవరికీ అపాయింట్మెంట్ అంత సులువుగా ఈయని జగన్ వర్మతో మాత్రం ఏకంగా గంటకు పైగా మాట్లాడారు అని అంటున్నారు. ఈ ఇద్దరి భేటీ మీద అనేక విషయాలు చర్చలకు వచ్చాయి. వర్మ తో రాజకీయ చిత్రాలు తీయించేందుకే ఈ భేటీ జరిగింది అని అంటున్నారు. అదే విధంగా ఏపీలో రాజకీయ ప్రత్యర్ధుల మీద ఈ సినిమాలనే ఎన్నికల ముందు బ్రహాంస్త్రలుగా వాడుకోవాలని వైసీపీ ఫిక్స్ అయిందని అంటున్నారు.

ఇలా ఎవరి ఊహాగానాలు వారివి సాగుతూండగానే ఆర్జీవీ తన సినిమాలను అనౌస్ చేశారు. రెండు పార్టులుగా తీయబోయే సినిమాలు అంటూ వ్యూహం, శపధం అని రెండు టైటిల్స్ ని కూడా ప్రకటించారు. ఇక ఇవి ఫక్తు పొలిటికల్ మూవీస్ అనే ఆయన చెప్పారు. తాను ఆ విధంగా చెప్పకపోతే జనాలు నమ్మరు అని కూడా ఆయన అంటున్నారు. ఇక మరో రోజు గడిచాక ఆయన ఇంకాస్తా మ్యాటర్ ని లీక్ చేసేలా బీజేపీ డివైడెడ్ బై పవన్ ఇంటూ సీబీఎన్ మైనస్ లోకేష్ ప్లస్ జగన్ అంటూ రాజకీయ గణితాన్ని వినిపించారు.

ఈ రాజకీయ గణితం గందరగోళం ఎవరికీ అర్ధం కాకున్నా చివరిన జగన్ ఉన్నారు. అందునా ఆయనకు ముందు ప్లస్ ఉంది. సో ఇదంతా జగన్ కి ప్లస్ గానే సాగుతుంది అని ఒక రొడ్డకొట్టుడు లెక్కకు రావచ్చు అని అనుకుంటున్నారు. జగన్ హీరో అన్నది తేలిపోతున్న వేళ విలన్లు ఎవరూ అంటే ఆయన రాజకీయ జీవితంలో ఎదురైన వారు అంతా అని సింపుల్ గా చెప్పుకోవాలి.

ఆర్జీవీ పవన్ చంద్రబాబు, లోకేష్ అని ప్రస్తావించారు కాబట్టి వీరి గురించి బాగానే టచ్ చేస్తారు అని అంటున్నారు. ఇక బీజేపీ ఏపీలో పోషించబోయే పాత్ర విషయంలో ఆ పార్టీకే ఒక క్లారిటీ లేదు కానీ ఆర్జీవీ అయినే ఏదో ఒక క్లారిటీ అయితే ఇస్తారనుకోవాలి. అది కూడా పాజిటివ్ గానే ఉన్నా ఆశ్చరపోనవరంలేదు. ఎందుకంటే ఏపీ పొలిటికల్ గేమ్ లో బీజేపీ కంటే కీలక పాత్రలు చాలా ఉన్నాయి.

కాబట్టి ఇక ఈ సినిమా గురించిన మరిన్ని ఊహాగానాలు చూస్తే వైఎస్సార్ తో యాత్ర మూవీ తీసిన మహి అనే ఔత్సాహిక దర్శకుడు యాత్ర టూ అనే మూవీని అప్పట్లో ప్లాన్ చేసుకున్నారు. వైఎస్సార్ యాత్రలో జగన్ పాత్ర పెద్దగా లేదు. కానీ యాత్ర టూ అంటే అంతా జగన్ దే అని చెప్పుకున్నారు. వైఎస్సార్ మరణానంత్రం జగన్ ఒక లీడర్ గా ఎమర్జ్ కావడం, ఆ సమయంలో ఆయనకు ఎదురైన అనేక ఇబ్బందులు సమస్యలు ఇవన్నీ ప్రస్థావిస్తూ యాత్ర టూ స్టోరీని ఆయన డిజైన్ చేసుకున్నారు అని చెపుకున్నారు.

మరి ఆయన ఏ కారణంతో మూవీ చేయలేదో తెలియదు కానీ ఇపుడు ఆర్జీవీ వ్యూహం యాత్ర మూవీ కధాంశంతోనే ఉండవచ్చు అని అంటున్నారు. అలాగే శపధం అన్నది పార్ట్ టూ గా అంటే జగన్ సీఎం అయ్యాక జరిగిన జరుగుతున్న పరిణామాలు అన్నీ కూడా ఉంటాయని అంటున్నారు.

మొత్తానికి ఆర్జీవీ చెప్పబోయేది ఏంటి అంటే జగన్ ది హీరో అని ఆయన ప్రత్యర్ధి పార్టీలే విలన్లు అని అంటున్నారు. ఇక చంద్రబాబుని లోకేష్ పాత్రలను లక్ష్మీస్ ఎన్టీయార్ లో ఒక లెవెల్ లో చూపించి ఆడేసుకున్న వర్మ పవన్ కళ్యాణ్ మీద ఆ మధ్య ఒక సెటైరికల్ మూవీ తీశారు. ఇపుడు ఆయన్ని ఏపీ రాజకీయాల్లో ఏ విధంగా చూపిస్తారో అన్న చర్చ ఉంది. ఏది ఏమైనా జగన్ హీరో అయితే మిగిలిన పాత్రలు కూడా వర్మ మార్క్ స్క్రిప్ట్ లో యాంటీగానే ఉంటాయని అంటున్నారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా వస్తున్న ఈ మూవీస్ మీద అంచనాలు ఎలా ఉంటాయో కానీ రాజకీయంగా మాత్రం సంచలనమే అంటున్నారు.

అలాగే ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న ఉచిత పధకాల మీద కూడా ఇందులో ప్రస్తావన ఉండవచ్చూ అంటున్నారు. వైసీపీ రాజకీయాలను ఇష్టపడే వారిని ముందు పెట్టి వైసీపీ హార్డ్ కోర్ టీమ్‌తో పాటు, వైసీపీ విజయాల చుట్టూ కేంద్రీకృతమైన ఒక పేరడీ కథను వర్మ డెవలప్ చేసినట్లు చెబుతున్నారు. చూడాలి మరి ఎంతవరకూ అది నిజమో.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.