Begin typing your search above and press return to search.
చలిజ్వరం మాటతో ఆర్జీవీ షాకింగ్ వ్యాఖ్య.. జగన్ సర్కారు ఇరుకున పడినట్లే
By: Tupaki Desk | 4 Feb 2022 3:17 AM GMTతాను మద్దతు ఇచ్చే వారి తరఫున మొండిగా వాదనలు వినిపించటమే కాదు.. తన వాదనలతో ఎంతో కొంత మందిలో కొత్త వాదనను వినిపించేలా చేసే టాలెంట్ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ సొంతం. రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన ఏ ఇష్యూ మీదనైనా మాట్లాడటం.. తనదైన రీతిలో రియాక్టు కావటం.. మాటలతో.. పోస్టులతో టార్గెట్ చేయటం వర్మకు కొత్తేం కాదు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీ అధికారపక్షం వైసీపీకి ఇబ్బందికరంగా మారేలా ఉండటం గమనార్హం.
ఏపీ ప్రభుత్వ తీరును తీవ్ర స్థాయిలో తప్పు పట్టేస్తూ.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన నిరసన ర్యాలీ ఎంత భారీగా సాగిందన్న విషయం తెలిసిందే. పోలీసుల ఆంక్షల నడుమ.. ఎవరికి వారుగా బయటకు వచ్చి విజయవాడకు చేరుకోవటమే లక్ష్యగా వ్యవహరించిన తీరు చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. బెజవాడకు తరలి వచ్చిన ఉద్యోగుల ప్రవాహం చూస్తే.. ఏపీ ప్రభుత్వంపై వారికెంత ఆగ్రహం ఉందన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారని చెప్పాలి. దీనికి తగ్గట్లే.. తాజాగా వర్మ చేసిన వ్యాఖ్య కూడా ఉందని చెప్పాలి.
‘‘ఏపీ సర్కారు సంగతేమో కానీ విజయవాడలో జన సందోహాన్న చూసి నాకు భయంతో చలి జ్వరం వచ్చేసింది’’ అంటూ కళ్లు పెద్దవి చేసి మరీ ట్వీట్ రూపంలో వర్మ పెట్టిన పోస్టు ఒక ఎత్తు అయితే.. దానికి తోడుగా మరో పోస్టు పెట్టారు. అందులో.. లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన నిరసన ర్యాలీ ఆయనకు షాకింగ్ గా మారిందని చెప్పాలి. అంతేకాదు.. లక్షలాదిమంది ప్రభుత్వ ఉద్యోగులు తమ సొంత ప్రభుత్వం మీద ఇంత భారీ ఎత్తున వ్యతిరేకిస్తూ నిరసన చేయటంపై వర్మ స్పందిస్తూ.. ‘ప్రపంచంలో ఎప్పుడూ ఎక్కడా ఇలా జరిగి ఉండదు’ అంటూ వ్యాఖ్యానించటం గమనార్హం.
వర్మ చేసిన వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్నారు. ఉద్యోగుల నిరసన ర్యాలీ మీద కూడా ఏమైనా సినిమా తీస్తావా? అని ఒకరు.. ‘మీకు కష్టం వస్తే మాట్లాడటానికి చిరంజీవి ఉన్నాడు. వాళ్లకు ఎవరూ లేరు. అందుకే రోడ్ల మీదకు వచ్చారు’ అంటూ వర్మను ఏసుకోవటం గమనార్హం. అంతేకాదు.. చలిజ్వరం అన్న మాటను కూడా తప్పు పడుతూ.. ‘చలి జ్వరం అంటున్నావు.. కరోనా టెస్టు చేయించుకో’ అంటూ ఉచిత సలహా ఇచ్చారు. వర్మ వ్యాఖ్యలపై స్పందించిన మరో నెటిజన్.. ‘ఒక చేత్తో మందు.. మరో చేత్తో అమ్మాయి ఉన్న నీకు మా బాధలు ఏం తెలుస్తాయి కానీ నీ సెటైర్లు ఆపు’ అంటూ చేసిన వ్యాఖ్యలు చూస్తే.. వర్మ మాటలకు ఆయన కోరుకున్నట్లుగా ఎవరూ రియాక్టు అయ్యేలా కనిపించటం లేదనే చెప్పాలి.