Begin typing your search above and press return to search.

మోడీని కూడా వదలని వర్మ

By:  Tupaki Desk   |   10 Feb 2019 10:43 AM GMT
మోడీని కూడా వదలని వర్మ
X
తన లక్ష్మీస్ ఎన్టీఆర్ కి వీలైంత పబ్లిసిటీ చేసుకోవడం కోసం రామ్ గోపాల్ వర్మ వేస్తున్న ఎత్తుగడలు చూస్తే వామ్మో అనిపించడం ఖాయం. ఆఖరికి నరేంద్ర మోడీని వాడుకోవడానికి వెనుకాడటం లేదు. విషయానికి వస్తే ఇవాళ నరేంద్ర మోడీ గుంటూర్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. దీని మీద ఇప్పటికె బిజెపి టిడిపి వర్గాల మధ్య మాటల పోరు తీవ్రంగా జరుగుతోంది. తన ప్రసంగంలో బాబు గురించి ఉదాహరించిన మోడీ స్వయానా పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేయడం మరోసారి కాక రేపింది.

ఈ వీడియో క్లిప్పింగ్ ని తీసుకున్న వర్మ తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ లక్ష్మీస్ ఎన్టీఆర్ కు మోడీ ప్రచారం చేస్తున్నారని గర్వంగా చెప్పుకున్నాడు. అక్కడ మోడీ అలా అనడం వెనుక ఉద్దేశం వేరే అయినప్పటికీ తనకు అనుకూలంగా మార్చుకున్న వర్మ దీన్ని వైరల్ చేసే పనిలో ఉన్నాడు. ప్రేమికుల రోజున విడుదల చేయబోయే ట్రైలర్ ముహూర్తం ఫిక్స్ చేసిన వర్మ దాంతో ఏం రచ్చ చేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే సినిమాలో స్టిల్స్ ని విచ్చలవిడిగా సోషల్ మీడియాకు వదిలిన వర్మ మెల్లగా ప్రేక్షకులు తన గురించి మాట్లాడుకునేలా చేస్తున్నాడు.

అయితే సినిమా కూడా ఇదే స్థాయిలో ఉంటుందని ఆశపడడానికి లేదు. వర్మ మాటలకు చేతలకు పొంతన ఉండదని గత కొన్నేళ్ళలో ఎన్నో సినిమాలు నిరూపించాయి. ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ కూడా ఏదో అద్భుతాలు చేస్తుందని కాదు కాని బయోపిక్ ల ట్రెండ్ ఉధృతంగా నడుస్తున్న వేళ ఇది టాక్ అఫ్ ది టౌన్ గా మారడానికి అవకాశం దొరికింది. ఇలాంటి వివాదాస్పద కథాంశం కాకపోతే వర్మ సినిమా ఇంత చర్చకు దారి తీసేంత సీన్ ఎక్కడిది