Begin typing your search above and press return to search.
కరోనా భయం: బంకర్లలోకి బిలియనీర్లు
By: Tupaki Desk | 21 April 2020 2:30 AM GMTశతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలంటారు. ఇప్పుడు కరోనా భయంతో ఆ వైరస్ సోకకుండా ఏం చేయాలని ఆలోచించిన బిలియనీర్లు - కోటీశ్వరులు ఒక కొత్త ఐడియాను కనుగొన్నారు. ముఖ్యంగా అత్యధిక మంది బిలియనీర్లు ఉన్న అమెరికాలో ఇప్పుడు కరోనా భయానికి వారంతా అండర్ గ్రౌండ్ కు పారిపోతున్నారట..
అమెరికాలో కరోనా తీవ్రస్థాయిలో ఉంది. 8లక్షల కేసులు నమోదయ్యాయి. 40వేల మంది ప్రాణాలు కోల్పోయారు. రోజురోజుకు మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. రోజుకు 2వేల చొప్పున మరణిస్తున్నారు.
దీంతో అమెరికాలో సంపన్న అమెరికన్లంతా సురక్షితంగా ఉండేందుకు బంకర్లలోకి వెళ్లి తమ ప్రాణాలను రక్షించుకుంటున్నారు. న్యూయార్క్ కు చెందిన మల్లీ మిలియనీర్ ఒకరు కరోనా భయానికి న్యూజిలాండ్ కు ప్రత్యేక విమానంలో వెళ్లి అక్కడ 11 అడుగుల మిలియన్ డాలర్ల విలువైన బంకర్ లో తలదాచుకుంటున్నాడట..
ఇక న్యూజిలాండ్ కు ఉత్తరాన ఉన్న సౌత్ ఐలాండ్ ద్వీపంలో సైనిక స్థావరంలోని భారీ బంకర్లలో 300మందికి సరిపడా బంకర్ ఏర్పాటు చేసినట్లు కాలిఫోర్నియాకు చెందిన సంస్థ వ్యవస్థాపకుడు తెలిపారు. ఇక ఇండియానాలోనూ 80మంది వ్యక్తులు బంకర్ లోకి వెళ్లారట.. జర్మనీలో 1000మంది వ్యక్తుల కోసం బంకర్ ను నిర్మించారట..
ఎక్కువగా వైరస్ తీవ్రత తక్కువగా ఉన్న న్యూజిలాండ్ సమీప ద్వీపాల్లో 10 ప్రైవేట్ బంకర్లను నిర్మించారు. 3 మిలియన్ డాలర్లు ఖర్చు చేసి మరీ లగ్జరీ రూములు ఏర్పాటు చేశారట.. సకల సౌకర్యాలతో భూగర్భంలో అత్యాధునిక బంకర్లను ధనవంతుల కోసం నిర్మించారని తెలిసింది.
ఇలా కరోనా వైరస్ భయానికి ప్రపంచంలోని ధనవంతులందరూ మిలియన్లు ఖర్చు చేసి బంకర్లలో తలదాచుకుంటున్నారు. సముద్రంలోని ద్వీపాలు.. వైరస్ లేని దేశాలకు వెళ్లి తమను తాము రక్షించుకుంటున్నారు.