Begin typing your search above and press return to search.

భారతీయ మహిళలపై అమెరికా మాజీ అధ్యక్షుడి పైత్యం

By:  Tupaki Desk   |   6 Sep 2020 5:00 PM GMT
భారతీయ మహిళలపై అమెరికా మాజీ అధ్యక్షుడి పైత్యం
X
తెల్ల జాతి దురంహకారాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ మరోసారి బయటపెట్టాడు. భారతీయ మహిళలపై నోరు పారేసుకున్నారు. ఆయన చేసిన అభ్యంతరకర వ్యాక్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపాయి. రిపబ్లికన్ పార్టీకి చెందిన అమెరికా మాజీ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ భారతీయులపై చులకన వ్యాఖ్యలు చేశారు.

1971లో జరిగిన భారత్-పాకిస్తాన్ యుద్ధంలో అమెరికా సపోర్టు భారత్ కు లేదు. పాక్ కే వారి మద్దతు ఇచ్చింది. అమెరికా స్వప్రయోజనాల కంటే అమెరికా అప్పటి అధ్య క్షుడు నిక్సన్ జాతి వివక్షే దీనికే కారణంగా చెబుతున్నారు.

అమెరికాకు 37వ అధ్యక్షుడిగా రిచర్డ్ నిక్సన్ 1969-1974 వరకు పనిచేశారు. ఆయన జాతీయ భద్రతా సలహాదారు హెన్నీ కిసింజర్ లకు భారతీయులంటే చాలా చులకన భావం ఉండేది. తాజాగా అప్పటి ఆడియో టేపులు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.

1971 జూన్ లో వైట్ హౌస్ లోని ఓవల్ ఆఫీసులో అధ్యక్షుడు నిక్సన్ తోపాటు అప్పటి చీఫ్ ఆఫ్ స్టార్ హాల్ట్ మన్ లు భారతీయ మహిళలపై నోరుపారేసుకున్న ఆడియో కలకలం రేపింది. భారతీయ మహిళలు ప్రపంచంలోనే అత్యంత ఆకర్షనీయంగా ఉండని వ్యక్తులు.. శృంగారమంటే తెలియదు. దరిద్రంగా ఉంటారని నిక్సన్ నోరుపారేసుకున్నారు. 1971లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ వైట్ హౌస్ లో నిక్సన్ తో భేటి అయ్యారు. ఆ మీటింగ్ లోనే నిక్సన్ ‘వారు నాకు నచ్చరు. ఎవరికైనా నచ్చుతారా? చెప్పు హెన్నీ అంటూ దారుణ వ్యాఖ్యలు చేశారు. భారతీయ మహిళలతో శృంగారం ఇష్టపడనంటూ మాట్లాడాడు.

ఇప్పటిదాకా రహస్యంగా ఉన్న ఈ టేపులను ప్రిన్స్ టన్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ గ్యారీ సేకరించారు. తాజాగా వీటిని న్యూయార్స్ టైమ్స్ లో వ్యాసంలో రాశారు. దీంతో నాటి అమెరికా అధ్యక్షుల జాతి వివక్ష వ్యతిరేక విధానాలు బయటపడ్డాయి. నిక్సన్ వ్యాఖ్యలు ప్రస్తుతం భారతీయ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.