Begin typing your search above and press return to search.
రాజన్ ను కాదని.. భారత్ తప్పు చేసిందా?
By: Tupaki Desk | 11 Oct 2017 10:25 AM GMTఅవునట! భారత్ లో బ్యాంకింగ్ వ్యవస్థను సక్రమంగా నిర్వహించే రిజర్వ్ బ్యాంకు గవర్నర్ గా ఇంతకు ముందు పనిచేసిన రఘురాం రాజన్ ను వదులుకుని దేశం పెద్ద తప్పు చేసిందని అంటున్నారు తాజాగా ఆర్థిక విభాగంలో నోబెల్ బహుమతి సాధించిన ప్రొఫెసర్ రిచర్డ్ థాలెర్. ఈ కామెంట్ తో భారత ఆర్థిక దిగ్గజాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. రాజన్ ను కోల్పోవడానికి దారితీసిన పరిస్థితులను వారు చర్చించుకుంటున్నారు. రాజన్ ఉండగా బ్యాంకింగ్ వ్యవస్థ స్వరూపాన్ని దాదాపు ఆయన మార్చారు. గ్రామీణ ప్రాంతాల్లో నేడు బ్యాంకుల ఏర్పాటు ఆయన వల్లే సాధ్యమైంది. అంతేకాదు, పేదలకు కూడా అకౌంట్ ఉండాలని ఆయన పదే పదే చెప్పేవారు.
మరి అలాంటి ఆర్థిక వ్యక్తిని ఎందకు పోగొట్టుకున్నట్టు? ఇది సమాధానం చిక్కని ప్రశ్న! ఇదే విషయాన్ని వెల్లడించిన థాలెర్.. రాజన్ వంటి నిపుణుడు అభివృద్ధి చెందుతున్న భారత్ కు లభించడం వరం అనే రేంజ్ లో కామెంట్లు చేశారు. అయితే, రాజన్ వల్ల భారత్ నష్టపోయినా.. తాము మాత్రం బాగుపడుతున్నామని థాలెర్ చెప్పడం ఇక్కడ ట్విస్ట్. అదేంటంటే.. చికాగో యూనివర్శిటీలో భాగంగా ఉన్న బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో రాజన్ ప్రొఫెసర్ గా పనిచేశారు. ఈయనతోపాటే థాలెర్ కూడా అందులో ప్రొఫెసర్ గా ఉన్నారు. దీంతో రాజన్ ను బాగా దగ్గరగా ఈయన పరిశీలించారు.
ఇక, తాజాగా ఆర్థిక శాస్త్రంలో థాలెర్ కు నోబెల్ లభించింది. అయితే, రాజన్ కూడా నోబెల్ కు పోటీ పడ్డారు. అయితే, కొద్ది తేడాతో ఆయన ఈ పురస్కారాన్ని కోల్పోయారు. దీనిపైనా థాలెర్ స్పందించారు. నేడు నోబెల్ అతనికి రాలేదేమో. రేపు భవిష్యత్తు మాత్రం వచ్చి తీరుతుంది అన్నారు. అంతేకాదు, రఘు తిరిగి అధ్యాపక వృత్తిలోకి వచ్చారు. నాకెంతో సంతోషంగా ఉంది. ఆయన్ను వదులుకోవడం భారత్ చేసుకున్న నష్టం. అని చెప్పారు. కాగా, ఈ స్కూల్ లో ప్రొఫెసర్ గా ఉన్న రాజన్.. మూడేళ్ల పాటు సెలవు తీసుకుని ఇండియాకు వచ్చారు. అప్పటి యూపీఏ ప్రభుత్వం ఈయనను ఆర్బీఐ గవర్నర్ గా నియమించింది. ఈ మూడేళ్ల పదవీ కాలంలో రాజన్ అనేక సంస్కరణలు తీసుకొచ్చారు.
పదవీకాలం పూర్తికావడంతో రాజన్ ను కొనసాగించేందుకు ప్రధాని మోదీ అంగీకరించలేదు. దీంతో ఆయన తిరిగి తన ప్రొఫెసర్ వృత్తికి వెళ్లిపోయారు. ఇదిలావుంటే, ఇటీవల ఓ సందర్భంలో భారత్ ఆర్థిక విషయాలపై స్పందించిన రాజన్.. మోదీ ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఆర్థిక పరిస్థితి ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతున్న సమయంలో ఇలాంటి ప్రయోగాలు మంచివి కావని ఆయన చెప్పడం కూడా ఆర్థిక నిపుణులను ఆలోచింప చేసింది. అయితే, ఇదే విషయంపై బీజేపీ సీనియర్ నేత - మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా కూడా మోదీని ఉతికి ఆరేసిన విషయం తెలిసిందే. రాజన్ ప్లేస్ లో గుజరాత్ కు చెందిన ఉర్జిత్ పటేల్ ను మోదీ ఏరికోరి .. ఆర్బీఐకి గవర్నర్ ను చేయడం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కూడా అసంతృప్తితో ఉన్నారని కథనాలు వస్తున్నాయి.