Begin typing your search above and press return to search.
వైసీపీ నేత కుమారుడితో ఎంపీ కోమటిరెడ్డి కూతురు వివాహం !
By: Tupaki Desk | 25 Nov 2020 5:10 PM GMTతెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూతురు పెళ్లి , రాజస్థాన్ ఉదయ్ పుర్ లో అతి కొద్ది మంది బంధువుల మధ్య చాలా ఘనంగా జరిగింది. ఎంపీ కోమటిరెడ్డి తన కుమార్తె శ్రీనిధిని, ఏపీ లో వైసీపీకి చెందిన ప్రముఖ సీనియర్ నేత కుమారుడు ప్రణవ్ తో బుధవారం ఘనంగా జరుగుతోంది. కరోనా వైరస్ కారణంగా ఈ వేడుకలో ఇరుకుటుంబాల దగ్గరి బంధువులు మాత్రమే పాల్గొన్నారు. కర్నూలుకు చెందిన శిల్పా మోహన్‌రెడ్డి సోదరుడు శిల్పా ప్రతాప్ రెడ్డి కుమారుడైన ప్రణవ్ రెడ్డితో శ్రీనిధికి వివాహం నిశ్చయించారు.
రాజస్థాన్ లో ఉదయ్ పూర్ లోని లీలా ప్యాలెస్ వేదికగా వీరిద్దరి కల్యాణం వైభవంగా జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరులకు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్, ఆ పార్టీకి చెందిన నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ వివాహ సంబంధంతో వీరి మధ్య స్నేహం మరింత ధృడంగా మారుతుంది అని చెప్పవచ్చు. ఈ మద్యే వారి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. వైఎస్సార్ ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న సమయంలో కోమటిరెడ్డి బ్రదర్స్ శిల్పా మోహన్ రెడ్డితో సన్నిహితంగా ఉండేవారు. ఈ క్రమంలో అతడి సోదరుడి కుమారుడికి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయడానికి నిర్ణయం తీసుకోని , పెళ్లి జరిపించారు.