Begin typing your search above and press return to search.
రికీ మార్టిన్ ముద్దు రేటెంతో తెలుసా?
By: Tupaki Desk | 23 April 2016 6:52 AM GMT సినీస్టార్లు - పాప్ సింగర్లకు ప్రపంచంలో ఉన్న క్రేజ్ ఎలాంటిదో తెలియంది కాదు. వారికోసం పడిచచ్చే అభిమానులున్నారు. వారితో కరచాలనం చేయాలని.. వారిని తాకాలని.. వారు వేసుకున్న దుస్తులను వేసుకోవాలని... ఇలా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన పిచ్చి అభిమానం ఉంటుంది. ఇంకొందరికైతే వారిని ముద్దాడాలని, వారితో సెక్సు చేయాలని కూడా ఉంటుంది. తాజాగా పాపులర్ పాప్ స్టార్ రికీ మార్టిన్ ను ముద్దాడే అవకాశాకాన్ని అందుకుందో అభిమాని.. అయితే, ఆ ఛాన్సు ఆమెకు అంత ఈజీగా రాలేదు. వేలంపాటలో ఏకంగా 60 లక్షలకు ఆ ఛాన్సు కొనుక్కుంది. ఇంకేముంది ఆ ఛాన్సు రాగానే రికీ మూతి వాచిపోయేలా ముద్దు పెట్టేసింది.
ప్రఖ్యాత పాప్ సింగర్ రికీ మార్టిన్ బ్రెజిల్ లోని సావోపాలోలో ఎయిడ్స్ మహమ్మారి బాధితుల కోసం ఓ ఛారిటీకి విరాళం ఇవ్వాలని భావించాడు. దీంతో తన ముద్దును వేలం వేశాడు. పాప్ సింగర్ గా ఎంతో క్రేజ్ ఉన్న రికీ మార్టిన్ ముద్దును వేలం వేయడంతో అతని ముద్దు కోసం చాలా మంది అభిమానులు పోటీ పడ్డారు. వీరిలో అనా పౌలా డినిజ్ అనే మహిళ తన అభిమాన పాప్ సింగర్ ను ముద్దాడేందుకు 60 లక్షల రూపాయలు చెల్లించింది. దీంతో రికీ మార్టిన్ తన అభిమాని అనా పౌలా డినిజ్ కు చుంబన అవకాశాన్ని ఇచ్చాడు. ఆమె రికీని తన ముద్దుతో మత్తెక్కించేసిందిట. ఇప్పుడు ఈ ముద్దు సీను సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
కొసమెరుపు ఏంటంటే ఛారిటీ షో కోసం మహిళను ముద్దాడినా రికీ మాత్రం మామూలుగా మహిళల జోలికి వెళ్లడట. అలా అని ఆయన బుద్ధిమంతుడని కాదు. ఆయనకు అమ్మాయిలు కంటే అబ్బాయిలే ఇష్టం. ఎందుకంటే రికీ గే కాబట్టి. ఆ విషయం గతంలో ఆయనే స్వయంగా ప్రకటించుకున్నాడు.