Begin typing your search above and press return to search.
టీవీతోనూ రింగింగ్ బెల్స్ సంచలనం
By: Tupaki Desk | 12 Aug 2016 10:30 PM GMTహైఎండ్ మల్టీఫ్లెక్స్ సినిమా టికెట్ కంటే తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ ను అందిస్తామంటూ ప్రకటించిన రింగింగ్ బెల్స్ సంస్థ దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ ప్రకటనతో మీడియా హెడ్ లైన్స్ లో దర్శనమిచ్చిన సదరు కంపెనీ.. అంతేలా వివాదాల్లో చిక్కుకుపోవటాన్ని మర్చిపోకూడదు. రింగింగ్ బెల్స్ మీద ఎన్నో ఆరోపణలు వచ్చినప్పటికీ.. తాము చెప్పినట్లే రూ.251లకే స్మార్ట్ ఫోన్ డెలివరీ చేసి తనపైన వస్తున్న ఆరోపణల్ని కొట్టిపారేసే ప్రయత్నం చేసింది.
అయితే.. ఈ సంస్థపై విమర్శనాస్త్రాల్ని సంధించే వారు ఇప్పటికీ ఉన్నారు. అయితే.. తమపై వేలెత్తి చూపిస్తున్న వైనాన్ని పట్టించుకోని రింగింగ్ బెల్స్ తాజాగా మరో సంచలనానికి తెర తీసింది. 31.5 అంగుళాల హెచ్ డీ టీవీని ఊహించని తక్కువ ధరకు డెలివరీ చేయనున్నట్లు ప్రకటించింది వ్యాపార వర్గాల్లో కలకలం రేపింది. బహిరంగ మార్కెట్లో ఈ తరహా టీవీలు ఏవైనా రూ.25 వేలకు పైగా పలుకుతుంటే.. రింగింగ్ బెల్స్ మాత్రం కేవలం రూ.9900లకే అందిస్తామని వెల్లడించింది.
ఫ్రీడమ్ 9900 పేరిట హెచ్ డీ టీవీని అందించనున్నట్లుగా రింగింగ్ బెల్స్ ప్రకటించింది. ఆగస్టు 15 నుంచి ఈ టీవీ బుకింగ్స్ స్టార్ట్ చేయనున్నట్లు వెల్లడించిన సంస్థ.. టీవీ మొత్తాన్ని ముందస్తుగా చెల్లించాల్సిన అవసరం లేదని..ప్రొడక్ట్ చేతికి వచ్చిన తర్వాత చెల్లించేలా ఒప్పందం మీద బుక్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. తమ స్మార్ట్ ఫోన్ కు ఎంతలా ఆదరణ లభించిందో అంతే ఆదరణ తమ టీవీలకు లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తాము ప్రకటించిన టీవీలను తమ కంపెనీ వెబ్ సైట్ నుంచి బుక్ చేసుకోవాలని రింగింగ్ బెల్స్ ప్రకటించింది. దీనిపై మరెన్ని వివాదాలు తెరపైకి వస్తాయో..?