Begin typing your search above and press return to search.
రూ.251కే ఫోన్ కంపెనీ ఖేల్ ఖతం!!
By: Tupaki Desk | 30 Dec 2016 12:30 AM GMTకొద్దికాలం క్రితం కేవలం రూ.251 కే ఫ్రీడం 251 స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తామంటూ సంచలనం సృష్టించిన రింగింగ్ బెల్స్ కంపెనీ గుర్తుందా..? అయితే ఇప్పుడదే కంపెనీకి చెందిన వార్త ఒకటి మనకు ప్రధానంగా వినబడుతోంది. ఆ కంపెనీ పని అయిపోయిందని, దాని ఎండీ మోహిత్ గోయల్ తప్పుకోవడంతో రింగింగ్ బెల్స్ దాదాపుగా మూత పడినట్టేనని తెలుస్తోంది. దీనికి తోడు అతని భార్య, రింగింగ్ బెల్స్ డైరెక్టర్లలో ఒకరైన ధర్న గోయెల్ కూడా తన పదవి నుంచి తప్పుకుందని సమాచారం. దీంతో రింగింగ్ బెల్స్ ఖేల్ ఖతమైనట్టేనని తెలుస్తోంది. అయితే వీరిద్దరూ కలిసి ఎండీఎం అనే మరో నూతన కంపెనీ ఏర్పాటు చేయనున్నారని తెలిసింది.
కాగా అప్పట్లో రూ.251కే స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తామని చెప్పి రింగింగ్ బెల్స్ వివాదాల్లో చిక్కుకోగా, లాటరీ ప్రాతిపదికన 70వేల ఫోన్లను అందించామని కంపెనీ చెప్పుకొచ్చింది. కానీ దీనిపై యూజర్లు అస్సలు స్పందించలేదు. ఈ క్రమంలో రింగింగ్ బెల్స్ గురించి తాజాగా తెలుస్తున్న సమాచారం చర్చనీయాంశంగా మారింది. ప్రపంచంలోనే అతి తక్కువ ధర స్మార్ట్‌ఫోన్ అంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించి అప్పటినుంచి రింగింగ్ బెల్స్ సంస్థ ఆర్డర్లు తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ అతితక్కువ ధర వివాదానికి కారణమైంది. ఇదో మోసపూరిత పథకమన్న ఆరోపణలు వచ్చాయి. అయితే అదే సమయంలో పెద్ద ఎత్తున ఆదరణ కూడా వచ్చింది. రెండు రోజుల సేల్ అని ప్రకటించినపుడు అయితే కంపెనీ వెబ్‌సైట్ క్రాష్ అయింది. ఈ డిమాండ్ గురించి కంపెనీ వివరిస్తూ సుమారు 30 వేల మంది వినియోగదారులు ఫోన్ కోసం బుక్ చేసుకున్నారని సంస్థ ప్రకటించింది. సుమారు ఏడు కోట్ల మంది ఫోన్ కోసం రిజిస్టర్ చేసుకున్నారని తెలిపింది.