Begin typing your search above and press return to search.
ఆఫీసుకు అద్దె కూడా కట్టని రింగింగ్ బెల్స్!
By: Tupaki Desk | 3 March 2016 9:27 AM GMTమార్కెట్లో మూడు.. నాలుగు వేల రూపాయిల విలువ చేసే స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.251 కే అందిస్తామంటూ ఉదరగొట్టేయటమే కాదు.. దేశ వ్యాప్తంగా హాట్‌టాపిక్ అయిన రింగింగ్ బెల్స్ కు సంబంధించిన లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ కంపెనీ ప్రకటించిన ఆఫర్ మీద మొదలు కొని..కంపెనీ వరకూ ఇప్పటివరకూ చాలానే ఆరోపణలు.. విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ కంపెనీకి సంబంధించి మరో ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది.
దేశ ప్రజలకు అత్యంత చౌకగా ఫోన్ ఇస్తామనే కంపెనీ.. తాను అద్దెకు ఉండే ఆఫీసుకు అద్దె చెల్లించలేదట. దీంతో.. సదరు ఆఫీసుకు తాళాలు వేసినట్లుగా చెబుతున్నారు. నొయిడాలో ఉన్న ఈ కంపెనీ కార్యాలయానికి తాళాలు పడ్డట్లు చెబుతున్నారు. ఆఫీసు మూసివేసిన విషయాన్ని నేరుగా ప్రస్తావించని సదరు కంపెనీ ప్రెసిడెంట్ అశోక్ చద్దా.. తాము పూర్తి స్థాయి వ్యాపారానికి కట్టుబడి ఉన్నట్లు చెప్పుకొచ్చారు.
తాము ఎక్కడికి పారిపోవటం లేదని చెబుతున్నప్పటికీ.. ఆఫీసుకు తాళం పడటంతో ఈ కంపెనీ మీద ఉన్న సందేహాలు మరింత ఎక్కువైన పరిస్థితి.