Begin typing your search above and press return to search.
ఆడటానికి వెళతారా? సెక్స్ కోసం వెళతారా?
By: Tupaki Desk | 26 July 2016 3:49 AM GMTప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఒలింపిక్స్ దగ్గరకు వచ్చేశాయి. విశ్వ క్రీడా సంరంభంగా చెప్పే ఒలింపిక్స్ లో విజేతగా నిలవటం కంటే కూడా.. ఆ క్రీడలో భాగస్వామ్యం కావటమే గొప్పగా భావిస్తుంటారు క్రీడాకారులు. ఇక.. ఇందులో విజేతగా నిలిస్తే వారి ఆనందం అంతాఇంతా కాదనే చెప్పాలి. నాలుగేళ్లకోసారి జరిగిన ఈ విశ్వ క్రీడా మహోత్సవాన్ని భారీగా నిర్వహించటానికి అతిధ్య దేశాలు భారీగా ఏర్పాట్లు చేస్తాయి.
ఈ క్రీడల కోసం వేలాది కోట్ల రూపాయిల్ని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చుచేస్తారు. ప్రపంచ దేశాల నుంచి వచ్చే క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఆతిధ్య దేశం మీద ఉంటుంది. అందుకేనేమో.. అన్ని కోణాల్లో ఆలోచించి ఏర్పాట్లు చేస్తారా? అన్న మాట తాజా ఉదంతాన్ని చూస్తే అనిపించక మానదు. ప్రపంచ దేశాల నుంచి వచ్చే క్రీడాకారులకు పసందైన భోజనాల్ని సిద్ధం చేయటానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో.. వారికి కండోమ్ లను అంతే భారీ సంఖ్యలో సరఫరా చేయటం ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.
తమను తాము పణంగా పెట్టుకొని ఒలింపిక్స్ బరిలో దిగుతారని భావించే క్రీడాకారులకు కండోమ్స్ తో పనేముందన్నది చాలామందికి ఎదురయ్యే ప్రశ్న. అయితే.. దీనికి సమాధానం చెప్పరు కానీ.. ఒలింపిక్స్ విలేజ్ లో బస చేసే 11వేల మంది క్రీడాకారుల కోసం.. మరో ఏడు వేల మంది సిబ్బందికి వసతి కల్పించనున్నారు. ఇందుకోసం..దాదాపు 4.5 లక్షల కండోమ్స్ ను సిద్ధం చేశారు. ఒక్కోక్రీడాకారుడికి 42 కండోమ్ లను సరఫరా చేయనున్నారు.
అంతేకాదు.. 3604 అపార్ట్ మెంట్లు.. టెన్నిస్ కోర్టులు.. సాకర్ మైదానాలు.. స్విమ్మింగ్ పూల్స్.. అధునాతన జిమ్స్ తో పాటు.. సకల వసతులు సిద్ధం చేస్తున్నారు. 13వేల టాయ్లెట్ సీట్లు.. 2.75 లక్షల క్లాత్ హ్యంగర్స్.. 18,500 బెడ్స్ ఏర్పాటు చేశారు. మొత్తంగా చూస్తే.. ఒక చిన్నసైజు నగరాన్నే నిర్మించారని చెప్పాలి. అయినా.. ఆడటానికి వచ్చే వారికి కండోమ్ ల అవసరం ఏముంటుందో..?