Begin typing your search above and press return to search.
తాడిపత్రిలో విగ్రహ రచ్చ మామూలుగా లేదుగా?
By: Tupaki Desk | 18 Feb 2022 1:30 PM GMTరాజకీయాలన్నాక భేదాభిప్రాయాలు సహజం. అంత మాత్రానికి మొండితనంతో ముందుకెళ్లటంతో ఇబ్బందులు తప్పవు. ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో అధికారం చేతిలో ఉంటే చెలరేగిపోతున్న వైనాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. అలాంటి వేళ.. ఇద్దరు నేతలు.. అదికూడా ఉత్తరదక్షిణ ధ్రువాల మాదిరి ఉంటే ఏపీ అధికార.. విపక్షానికి చెందిన నేతల మధ్య మొదలైన పవర్ గేమ్ ఇప్పుడు మరో మలుపు తిరిగింది. దీంతో.. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎప్పుడేం అవుతుందో తెలీని అయోమయ పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ఇద్దరూ ఇద్దరే అన్నట్లుగా వ్యవహరించే వైఖరి ఉండదనే ఉంది.
ఒకవైపు అధికార పార్టీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. మరోవైపు తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ గా విపక్షానికి చెందిన జేసీ ప్రభాకర్ రెడ్డి. మామూలుగానే వీరిద్దరికి అస్సలు పడదు. రాజకీయ విభేదాలు ఉండనే ఉన్నాయి. నిత్యం పవర్ గేమ్ నడుస్తూనే ఉంటుంది. ఇలాంటి వేళ.. నిబంధనలకు అనుగుణంగా పోవాల్సిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి అందుకు భిన్నంగా తన తండ్రి కేతిరెడ్డి రామిరెడ్డి విగ్రహాన్ని తాడిపత్రి - అనంతపురం జాతీయ రహదారి మీద ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు. అందుకు నిబంధనలకు అనుగుణంగా అనుమతులు తీసుకోవాలన్న ఆలోచన అస్సలు చేయటం లేదు.
దీంతో.. మున్సిపల్ ఛైర్మన్ గా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి మరింత సీరియస్ గా ఉన్నారు. ఏమైనా చేయండి.. రూల్ ప్రకారం వ్యవహరించాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. టీడీపీకి చెందిన మున్సిపల్ ఛైర్మన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి ఉన్న నేపథ్యంలో తన తండ్రి విగ్రహ ఏర్పాటుకు అనుమతి రాదన్న భావనతో ఉన్నారు. దీంతో అనుమతి తీసుకోవటం ఎందుకు? అని అనుకున్నారో ఏమో కానీ.. ఎవరినీ అడగకుండానే.. తాను అనుకున్న చోట పెద్ద దిమ్మ కట్టేసి విగ్రహాన్ని తసుకొచ్చి పెట్టేశారు.
దీనిపై ఆగ్రహానికి గురైన జేసీ ప్రభాకర్ రెడ్డి తొలుత కమిషనర్ కు ఆ తర్వాత జిల్లా కలెక్టర్ గా ఫిర్యాదు చేశారు. విగ్రహ ేర్పాటును ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఒకవైపు అధికార పార్టీ ఎమ్మెల్యే.. మరోవైపు ప్రజలు ఎన్నుకున్న విపక్ష మున్సిపల్ ఛైర్మన్. దీంతో అధికారులు సైతం మింగా లేక కక్కాలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి పంతం ఇప్పుడు పట్టణంలో కొత్త టెన్షన్ కు కారణమైంది. నిబంధనలకు భిన్నంగా వ్యవహరిస్తే ఊరుకుంటామా? అని జేసీ కారాలు మిరియాలు నూరుతున్న వేళ.. ఏంజరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో తాడిపత్రిలో హైటెన్షన్ నెలకొంది.