Begin typing your search above and press return to search.
#Riptwitter.. ట్విట్టర్ ఇదే ఇప్పుడు ట్రెండింగ్
By: Tupaki Desk | 20 Nov 2022 6:10 AM GMTట్విట్టర్ అంటేనే ట్రెండింగ్. రోజుకో అంశం మీద నెటిజన్లు తమ నిరసనను.. తమ ప్రేమను చూపించేందుకు దీన్ని వాడుతారు. అందులో హ్యాష్ ట్యాగ్ లు పెట్టి మరీ ట్రోల్స్, మీమ్స్ చేస్తూ తమ వాదన వినిపిస్తారు. అయితే ట్రెండింగ్ కు ట్రెండ్ సెట్టర్ అయిన ట్విట్టర్ ఇప్పుడు దానిమీదనే ట్రెండింగ్ లోకి వెళ్లడం ఇక్కడ సంచలనమైంది.
సోషల్ మీడియా దిగ్గజం ఉద్యోగులకు ఎలన్ మస్క్ ఇచ్చిన అల్టిమేటం సామూహిక రాజీనామాకు కారణమైన తర్వాత ట్విట్టర్ శుక్రవారం వివిధ పోస్ట్‌లతో ట్రెండింగ్ లోకి వచ్చింది. తీసేసిన ఉద్యోగులు, ఇతరులు చాలా మంది తమ ఆలోచనలను పంచుకోవడానికి ట్విట్టర్‌లోకి వెళ్లారు. ఎలన్ మస్క్ చేష్టలతో ఈ మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌కు ఇది ముగింపు అని ఆడిపోసుకున్నారు. ఈ క్రమంలోనే #RIPTwitter అనే హ్యాష్‌ట్యాగ్‌ని అందరూ ట్విట్టర్ యూజర్లు వైరల్ చేశారు. ఊహించిన విధంగా ఈ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్ గా మారింది. చాలా మంది ఇప్పటికీ ఈ విషయానికి సంబంధించి పోస్ట్‌లను పంచుకుంటూనే విమర్శలు గుప్పించారు. ఇక ట్విటర్ కొత్త యజమాని మరియు ఈసీవో మస్క్ చేసిన దీనికి కౌంటర్ గా చేసిన ట్వీట్ ప్రజల దృష్టిని ఆకర్షించింది.
ఎలన్ మస్క్ 'రిప్ ట్విట్టర్ ' హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ కు వ్యతిరేకంగా సమాధి చిత్రాన్ని షేర్ చేసారు. చిత్రంలో కొంతమంది వ్యక్తులు సమాధి ముందు పోజులు ఇస్తున్నారు. సమాధి పైన ట్విట్టర్ లోగోలు, దాని ముందు కూర్చున్న వ్యక్తులలో ఒకరి ముఖాన్ని ట్విటర్ లోగోతో పెట్టి మార్ఫింగ్ చేశారు. మీరు ఎంత సమాధి అన్నా అది లేస్తుందని అర్థం వచ్చేలా ఎలన్ మస్క్ ఇలా కౌంటర్ ఇచ్చారు. ఒకరోజు క్రితం షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు, ట్వీట్‌కు రెండు మిలియన్లకు పైగా లైక్‌లు వచ్చాయి. ట్రెండింగ్ సంఖ్యలు పెరుగుతున్నాయి. ఈ షేర్ వివిధ కామెంట్‌లను పోస్ట్ చేయడానికి ప్రజలను ప్రేరేపించింది.
"బ్రో నేను ట్విట్టర్ మరణం గురించి ట్వీట్ల కోసం ప్రతి సెకను నాన్‌స్టాప్‌గా ట్విట్టర్‌ని తనిఖీ చేస్తున్నాను" అని ట్విట్టర్ వినియోగదారు రాశారు. "ట్విట్టర్ 2.0?" అని మరొకరు కామెంట్ చేశారు. ట్విటర్ ను కొనేందుకు ముందు ఎలన్ మస్క్ ట్విట్టర్ వినియోగదారులందరికీ $44బిలియన్ డాలర్లు సమానంగా పంపిణీ చేసి ఉండవచ్చు.. మేము మా ఖాతాలను మేమే తొలగించుకుంటాము," అని కొందరు సెటైర్లు వేశారు. ఇలా 'ట్విటర్ రిప్' ప్రస్తుతం ట్రెండింగ్ మారింది. కామెంట్ల వర్షం కురుస్తోంది. ఎలన్ మస్క్ తీరుతో ట్విట్టర్ సమాధి కడుతున్నారని మండిపడుతున్నారు.