Begin typing your search above and press return to search.

జట్టుతో రిషబ్ పంత్.. ప్రాక్టీస్ మొదలు

By:  Tupaki Desk   |   16 Jun 2019 4:22 AM GMT
జట్టుతో రిషబ్ పంత్.. ప్రాక్టీస్ మొదలు
X
భారత తూరుపు ముక్క - ఓపెనర్ శిఖర్ ధావన్ ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో వీరోచిత సెంచరీ చేసి భారత జట్టును గెలిపించాడు. ఆ మ్యాచ్ లో చేతి వేలికి గాయం అయినా లెక్కచేయకుండా పోరాడాడు. అయితే గాయం కావడంతో మిగతా మ్యాచ్ లకు దూరమయ్యాడు. అతడికి మూడు వారాల రెస్ట్ కావాలని వైద్యులు సూచించారు. అయితే టీం మేనేజ్ మెంట్ మాత్రం బలమైన శిఖర్ ధావన్ స్థానంలో వేరొకరిని జట్టులోకి ఎంపిక చేయలేదు..

కానీ స్టాండ్ బై ఆటగాడిగా మాత్రం రిషబ్ పంత్ ను తాజాగా ఇంగ్లండ్ కు పంపింది. 15మందితో కూడిన భారత జట్టులో మొదట పంత్ కు జట్టులో చోటు దక్కలేదు. కానీ శిఖర్ గాయపడడం.. కోలుకుంటాడో లేదోనని ముందస్తుగా రిషబ్ ను ఎంపిక చేసి పంపించింది. శుక్రవారం మాంచెస్టర్ చేరుకున్న రిషబ్ పంత్ ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టాడు.

ఈరోజు పాకిస్తాన్ తో మ్యాచ్. తుదిజట్టులో స్థానం దక్కే అవకాశం లేకపోయినప్పటికీ ఆటగాళ్లతో కలిసి రిషబ్ ప్రాక్టీస్ చేశాడు. ధోని నుంచి పలు సలహాలు తీసుకున్నాడు. ఈ మేరకు ధోనితో కలిసి ఉన్న పంత్ ఫొటోను బీసీసీఐ ట్వీట్ చేసింది.

శిఖర్ గాయం చిన్నపాటిదే కావడంతో అతడిని జట్టులోనే కొనసాగించాలని టీమ్ మేనేజ్ మెంట్ నిర్ణయించింది. ఒకవేళ శిఖర్ కోలుకోకపోతే రిషబ్ ను అందుబాటులో ఉంచితే మంచిదనే కారణంతో అతడిని ఇంగ్లండ్ కు పంపింది. దీంతో స్టాండ్ బై ఆటగాడిగా పంత్ ప్రస్తుతానికి భారత జట్టుతో ఉన్నాడు.