Begin typing your search above and press return to search.
అనూహ్యంగా రిషి వెనుకబడ్డారా? తాజా సర్వేలో షాకింగ్ అంశాలెన్నో!
By: Tupaki Desk | 23 July 2022 4:35 AM GMTబ్రిటన్ ప్రధాన మంత్రి పదవికి జరుగుతున్న ఎన్నికల్లో ఇప్పటివరకు సాగిన ఐదు రౌండ్లలో భారత మూలాలు ఉన్న రిషి సునక్ దూసుకెళ్లటం.. అపూర్వ విజయానికి అతగాడు మరో అడుగు దూరంలో ఉన్నట్లుగా వార్తా కథనాలు పబ్లిష్ కావటం తెలిసిందే. అందరూ చెబుతున్న మాటలకు భిన్నంగా తాజా పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని చెబుతోంది బ్రిటన్ లోని ప్రముఖ ఇంటర్నెట్ మార్కెట్ రీసెర్చ్.. ఎనలిటిక్స్ సంస్థ అయిన 'యూగోవ్'
ఇప్పటివరకు అధికారిక కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు అత్యధికంగా రిషి సునక్ వైపే నిలవటం.. అతడితో ప్రధానమంత్రి స్థానానికి పోటీ పడుతున్న ట్రస్ వెనుకబడిపోవటం తెలిసిందే. తుది రౌండ్ లో పార్టీకి చెందిన సభ్యులంతా ఓట్లు వేయాల్సిన పరిస్థితి. దాదాపు 1.6 లక్షలకు పైనే ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొంటారని.. ఇందులో మెజార్టీ సాధించిన వారే ప్రధాన మంత్రి కుర్చీలో కూర్చుంటారన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఎన్నిక సెప్టెంబరులో జరగనుంది.
ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు వెలువడిన ఫలితాలకు.. ఇప్పటివరకు సాగుతున్న ప్రచారానికి భిన్నంగా రిషి కంటే కూడా ట్రస్ కే ఎక్కువమంది మద్దతు పలుకుతున్నట్లుగా సర్వే రిపోర్టు పేర్కొనటం షాకింగ్ గా మారింది. తాజాగా విడుదలైన సర్వే చెబుతున్న అంశాల్ని చూస్తే..
- యూగోవ్ రెండు రోజుల పాటు నిర్వహించిన సర్వేలో మొత్తం 730 మంది పార్టీ సభ్యులు పాల్గొన్నారు. వారిలో 62 శాతం మంది తమ ఓటు లిజ్ ట్రస్ కే వేస్తామని పేర్కొన్నారు.
- తాము చేసిన సర్వేలో పాల్గొన్న ఓటర్లలో కేవలం 38 శాతం మంది మాత్రమే రిషి సునక్ వైపు ఉన్నట్లు పేర్కొన్నారు.
- సర్వేల్లో గత వారం వరకు రిషిపై కేవలం 19 శాతం మాత్రమే లీడ్ ఉన్న ట్రస్ ఇప్పుడు ఏకంగా 24 పాయింట్లు అధిక్యతను సాధించింది.
- కన్జర్వేటివ్ పార్టీలో ఎక్కువ మంది ఎంపీలు రిషి వైపు ఉన్నప్పటికీ.. పార్టీ సభ్యుల్లో మాత్రం అత్యధికులు ట్రస్ పక్షాన ఉన్నారు.
- పార్టీలో ఆమెకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉండటం.. గుర్తింపు ఉండటం ఆమెకు లాభించింది. అదే ఆమెను సర్వేలో ముందుండేలా చేసింది.
- బ్రిటన్ లోని బెట్టింగ్ రాయుళ్లు సైతం ట్రస్ తమ ఫేవిరెట్ గా చెబుతున్నారు.
సర్వే పేర్కొన్న అంశాలతో ఒక్కసారి సీన్ రివర్సు అయినట్లుగా మారింది. ఇప్పటివరకు అధిక్యతలో దూసుకెళ్లిన రిషి.. అనూహ్యంగా ఎలా వెనుకబడతారు? అందుకు కారణాలు ఏమిటి? అన్న దానిపై సర్వే రిపోర్టు చెప్పలేదని రిషి మద్దతుదారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏమైనా.. తాజా సర్వే ఫలితం రిషికి మద్దతు నిలిచిన వారికి బ్యాడ్ న్యూస్ గా మారిందని చెప్పక తప్పదు.