Begin typing your search above and press return to search.
వాటికి మా పేర్లు ఎందుకు పెట్టడంలేదు..?
By: Tupaki Desk | 20 Nov 2019 10:00 AM GMTసినిమా రంగం ..రాజకీయం ..ఈ రెండింటికి విడదీయరాని బంధం ఉంది. ఒక రంగంలో పనిచేసే వారు ..ఇంకో రంగం వారికీ సహాయం చేస్తుంటారు. సినిమాలలో ఎంతో కీర్తి ప్రతిష్టతలు పొందిన నటులు - ఆ తరువాత కాలంలో రాజకీయ నేతలుగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ , తాజాగా రిషి కపూర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇతర దేశాలు సినిమా వారిని బాగా గౌరవిస్తామని , కానీ మన దేశంలో సినీ స్టార్స్ కి సరైన గుర్తింపు దక్కడంలేదు అని వాపోయారు. రిషి కపూర్ దాదాపు ఏడాది పాటు క్యాన్సర్ తో పోరాడి అమెరికాలో చికిత్స తీసుకుని ఇండియాకు వచ్చాడు. ఇప్పుడు మళ్లీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఆయన ‘ది బాడీ’ అనే సినిమాతో బిజీగా ఉన్నారు.
అయన నగరాలకు - ప్రసిద్ధ రహదారులకు కేవలం రాజకీయ నేతల పేర్లని మాత్రమే పెడుతున్నారు. సినిమా వాళ్ళ పేర్లని ఎందుకు పెట్టడంలేదు అని ప్రశ్నించారు. మన ప్రభుత్వం సినీ ఆర్టిస్ట్ లను ట్రీట్ చేసే విధానం చూస్తే నాకు చాలా బాధగా ఉంటుంది. సినిమా - సంగీతం - కల్చర్ వల్లే భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. కానీ సినీ లెజెండ్స్ ను ప్రభుత్వం ఎలా చూస్తుందో చూడండి. ఇతర దేశాలు తమ సెలబ్రిటీలను ట్రీట్ చేస్తున్నట్లుగానే మన దేశం అలా చేస్తోందా? కొత్త రహదారులు - ఫ్లై ఓవర్స్ - ఎయిర్ పోర్ట్స్ కి రాజకీయ నాయకుల పేర్లే పెడుతున్నారు. సినీ ఆర్టిస్ట్ ల పేర్లు ఎందుకు పెట్టడంలేదు. మనకు పండిట్ రవి శంకర్ - ఉస్తాడ్ అల్లా రఖా - లతా మంగేష్కర్ లాంటి గొప్ప ఐకాన్స్ ఉన్నారు.
భారతదేశంలోనే కాదు ఇతర దేశాల్లోనూ వీరిని గొప్ప సెలబ్రిటీలుగా ఆరాధిస్తారు. అమెరికాలో చాలా ప్రదేశాలకు మైఖెల్ జాక్సన్ - ఎల్విస్ ప్రెస్లీ వంటి గొప్ప ఆర్టిస్ట్ ల పేర్లు పెట్టారు. ఇలా చేయడం వల్ల ఈ తరం వారికి వారి గొప్పతనం గురించి తెలుస్తుంది. కానీ భారతదేశంలో మాత్రం కేవలం రాజకీయ నేతల పేర్లనే వాడుతుంటారు. కల్పనా చావ్లా లాంటి గొప్ప వ్యోమగామి ఎందరో యువతకు రోల్ మోడల్. మన పిల్లలకు ఆమె గురించి ఎంత వరకు తెలుసు? బతికున్నప్పుడు సినీ ఆర్టిస్ట్ లను ఎవ్వరూ గుర్తుచేసుకోరు - గౌరవించరు. ఇలాంటి గొప్ప ఆర్టిస్ట్ ల పేర్లను ఎయిర్ పోర్ట్స్ కి - రహదారులకు - స్కూల్స్ కి - కాలేజ్ లకు పెట్టకపోతే తర్వాతి తరానికి వారి గొప్పతనం గురించి ఎలా తెలుస్తుంది అంటూ తనలోని భావాన్ని బయటపెట్టారు. చూడాలి మరి రిషి కపూర్ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ ఏమంటారో ..